మీడియాకు టోకరా: సిఎంతో భేటీ, బ్యాక్ డోర్ నుంచి సూరీడు..
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కార్యాలయానికి రావడం హాట్ టాపిక్‌గా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైఎస్ కుమారుడు జగన్‌కు చెందిన సాక్షి పత్రిక అమరావతి భూదందా గురించి వరుస కథనాలను ప్రచురిస్తున్న నేపథ్యంలో సూరీడు చంద్రబాబు కార్యాలయానికి వచ్చారు.
అయితే, మీడియాకు కనిపించుకుండా సూరీడు తిరిగి వెళ్లిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కార్యాలయం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం నుంచి బయటకు రాకుండా మీడియా కళ్లు గప్పారు. సూరీడు కోసం మీడియా వేచి చూసింది.
అయితే, ఆ సమయంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు నడుచుకుంటూ బయటకు వచ్చి మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ మెయిర్ గేటు వరకు వెళ్లారు. ఆ సమయంలో వెనక గేటు నుంచి సూరీడిని బయటకు పంపించారు.

మీడియాను పక్కదారి పట్టించేందుకే మంత్రులు బయటకు నడుచుకుంటూ వచ్చారని అంటున్నారు. సూరీడు చంద్రబాబుతో చాలాసేపు భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది. సిఎం కార్యదర్శి సతీష్ చంద్రను కూడా ఆయన కలిసినట్లు సమాచారం.
2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఇప్పటి వరకు సూరీడు ఎక్కడా కనిపించలేదు. ఇంత కాలానికి చంద్రబాబు కార్యాలయంలో ఆయన ప్రత్యక్షం కావడం ఉత్కంఠను రేపింది. జగన్ గుట్టు మట్లు తెలుసుకోవడానికి సూరీడిని చంద్రబాబు పిలిపించినట్లు చెబుతున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications