'వీవీఐపీలు నన్ను అపహాస్యం చేశారు, మోడీది అదే పరిస్థితి'

న్యూఢిల్లీ: ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవమే నేడు ప్రధాని నరేంద్రమోడీకి ఎదురవుతోందని మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. బెంగుళూరులో ఆదివారం దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశ రాజకీయం వీవీఐపీల చుట్టూ తిరుగుతోందన ఆయన విమర్శించారు.

అప్పట్లో ప్రధానిగా తన సాధారణ జీవితాన్ని జీర్ణించుకోలేకపోయిన వీవీఐపీలు తనను అపహాస్యం చేశారన్నారు. ఢిల్లీ వీవీఐపీలు పార్టీలకు మోజు పడతారని, వారి చెడు సంస్కృతితో ప్రధానిగా ఉన్న సమయంలో తాను విభేదించానని తెలిపారు. ఈ కారణంగా వీవీఐపీలు తనను అపహాస్యం చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రధాని మోడీకి కూడా ఎదురవుతోందని అన్నారు. ఈ విషయంపై ఆయన నోరు విప్పారని, తన మద్దతు మోదీకి ఉంటుందని స్పష్టం చేశారు. ఎడ్లబండి నడిపే రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రధాని హోదాలో కూడా సాధారణ జీవితం గడపడాన్ని ఢిల్లీ వీవీఐపీలు జీర్ణించుకోలేకపోయారని వివరించారు.

 Thank PM Modi for 'exposing despicable culture' of Delhi elites, says Deve Gowda

మోడీ కూడా అదే స్థాయి నుంచి వచ్చి ప్రధాని అయ్యారని పేర్కొన్న దేవేగౌడ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయనను హెచ్చరించారు. ఇక, ఢిల్లీ వీవీఐపీల ఆటుపోట్లను గతంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, మొరార్జీ దేశాయ్‌, చంద్రశేఖర్‌, చరణ్‌సింగ్‌లు కూడా ఎదుర్కొన్నట్టు ఆయన చెప్పారు.

కాగా, కర్ణాటకలోని ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన హెచ్‌డీ దేవేగౌడ 1996లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైతు కుటుంబములో పుట్టిన దేవేగౌడ, రైతుగా శిక్షణ పొందారు. 1962లో తొలిసారిగా కర్ణాటక శాసనసభకు ఎన్నికై కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు

1970వ దశకము చివరలో జనతా పార్టీలో ఎదిగిన దేవేగౌడ, 1980లో పార్టీ చీలీపోయినప్పుడు దాని వారసపార్టీ అయిన జనతాదళ్‌ను తిరిగి సమైక్య పరచటంలో ప్రధానపాత్ర పోషించారు. దేవేగౌడ పార్టీలోకి విభిన్న కులాలకు చెందిన వ్యక్తులను ఆకర్షించడంలో కీలకమయ్యారు.

1996 సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రేసు ఓడిపోయి, అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేసిన తర్వాత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వం నెలకొల్పలేకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి దేవేగౌడ ప్రధానమంత్రి అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+