షాక్: గ్రామస్తులను పెళ్లాడిన నటి దీపిక, సోనాక్షి!
లక్నో: పేదలకు చౌక ధరల్లో ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థకు కొందరు కిలాడీలు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన ఈ దందాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లా మీరాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాహెబ్‌గంజ్‌లో ఓ రేషన్ డీలర్ బాలీవుడ్ నటీమణుల పేరుతో కార్డులు సంపాదించి రేషన్ సరుకులు పొందుతున్నాడు.

బాలీవుడ్ తారలు దీపిక పదుకొనే, సోనాక్షి సిన్హా, జాక్విలిన్ ఫెర్నాండెజ్, రాణిముఖర్జీ, తదితరుల పేర్లతో రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ తారలందరూ ఇక్కడి గ్రామస్తులను వివాహం చేసుకున్నాడని ఆ రేషన్ డీలర్ పేర్కొన్నాడు. అంతేగాక, వారి ఆదాయం ఏడాదికి రూ. 11వేలేనని పొందుపర్చాడు.
రేషన్ డీలర్లు ఈ విధంగా అక్రమంగా కార్డులు పొంది సరుకులు పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబందిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications