వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహజీవనానికి అనుమతివ్వండి: కోర్టుకెక్కిన యువతులు

|
Google Oneindia TeluguNews

మదురై: ఇద్దరు యువతీయువకులు సహజీవనం చేయడం సాధారణ విషయమే. అయితే, ఇద్దరు యువతుల సహజీవనం అంటే కొంత వింతగానే అనిపిస్తోంది మరి. కానీ, సహజీవనానికి తమను అనుమతించాలంటూ కర్ణాటకకు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం తమిళనాడులోని మదురై జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

బెంగళూరుకు చెందిన వరుణ్‌ అలియాస్‌ వెరోనికా(22), మాలిని(19) బెంగళూరులోని ఒక షాపింగ్‌ మాల్‌లో పనిచేసేవారు. వెరోనికా తనను తాను యువకుడిగా భావించేది. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పింది. కాగా, వీరిద్దరి మధ్య ఏర్పడ్డ బంధాన్ని నిరుడు ఇరు కుటుంబాలవారు తీవ్రంగా వ్యతిరేకించారు.

Two girls turn to court

దీంతో వీరిద్దరూ నాలుగు నెలల క్రితం ఇళ్ల నుంచి వచ్చేసి తమిళనాడులోని వేలాంకన్నిలో గది అద్దెకు తీసుకుని జీవించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వచ్చి, వీరిని బెంగళూరుకు తీసుకెళ్లి, నిర్బంధించారు.

మూడు నెలలపాటు దూరంగా ఉన్న వీరు ఇటీవల తిరిగి కలుసుకొని చెన్నై చేరుకున్నారు. అక్కడ అనుకూలంగా లేకపోవడంతో మదురైకు వచ్చారు. వీరు మదురైలోని హిజ్రా భారతి కన్నమ్మను కలవగా, ఆమె మంగళవారం మదురై జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. వీరి దరఖాస్తు బుధవారం విచారణకు రానుంది.

English summary
Two Kannada girls were turn to Madurai Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X