చంద్రబాబు పనితనం: జగన్‌కు ప్రణబ్ షాకిచ్చారా?

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ రకమైన షాకిచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు బాగానే పని చేస్తున్నారని రాష్ట్రపతి స్వయంగా జగన్ ఎదుట అభిప్రాయపడ్డారట.

వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైసిపి నేతలతో రాష్ట్రపతి అలాంటి వ్యాఖ్యలు చేస్తారని భావించడం కష్టమే. కానీ రాష్ట్రపతి వైసిపి నేతల వద్ద చంద్రబాబుకు ఓ విధంగా ప్రశంస ఇచ్చారని రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి.

YS Jagan meets President Pranab Mukherjee

ఏపీకి ప్రత్యేక హోదా, జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం తదితర విషయాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించేందుకు జగన్ సోమవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రపతి.. జగన్‌కు షాకిచ్చారట.

YS Jagan meets President Pranab Mukherjee

జగన్ బృందం సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రణబ్‌ను కలిసింది. చంద్రబాబు పైనా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్... చంద్రబాబు బాగానే పని చేస్తున్నారట అని వ్యాఖ్యానించారట. దీంతో జగన్, వైసిపి నేతలు అవాక్కయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై వైసిపి ఎంపీలే స్వయంగా పార్లమెంటు ఆవరణలో టిడిపి ఎంపీలతో చెప్పారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+