వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలును వదిలేసి 2గంటలపాటు డ్రైవర్ మాయం: కారణం తెలిస్తే షాక్!

ఇటీవల కాలంలో కొందరు రైలు డ్రైవర్ల ప్రవర్తనతో ప్రయాణికులు ఆందోళన చెందాల్సి వస్తోంది. గతంలో ఓసారి రైలును పట్టాలపైనే ఆపేసిన ఓ డ్రైవర్.. సమీపంలోని కొట్టులో ఆహార పదార్థాలను కొనుగోలు చేశాడు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఇటీవల కాలంలో కొందరు రైలు డ్రైవర్ల ప్రవర్తనతో ప్రయాణికులు ఆందోళన చెందాల్సి వస్తోంది. గతంలో ఓసారి రైలును పట్టాలపైనే ఆపేసిన ఓ డ్రైవర్.. సమీపంలోని కొట్టులో ఆహార పదార్థాలను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో రైలును పట్టాలపైనే సుమారు పది నిమిషాలపాటు ఆపేశాడు.

తాజాగా, మరో డ్రైవర్ ఏకంగా రెండుగంటలపాటు రైలును పట్టాలపైనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పట్టాలపై రైలు ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చే ఇతర రైళ్లు కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Driver in Bihar stops train midway, goes missing for about 2 hours to take cold shower

డ్రైవర్ ఎంకే సింగ్ చేసిన వ్యవహారం ఇప్పుడు రైల్వే వ్యవస్థలో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్ రాజధాని పాట్నలో బక్సర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఉదయం 10.55గంటలకు రైలును స్టేషన్లో వదిలేసిన సింగ్.. చివరకు రెండు గంటల తర్వాత మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో తిరిగొచ్చాడు.

ఎక్కడికెళ్లిపోయావయ్యా అని అధికారులు ప్రశ్నించగా.. 'ఇంజన్‌లో చాలా వేడిగా ఉందని.. అందుకే స్నానం చేసొచ్చా' అని చల్లగా చెప్పాడు సింగ్. కాగా, ఈ ప్రాంతంలో ఎండలు 40 డిగ్రీలు దాటిపోయి జనాలను హడలెత్తిస్తుండటం గమనార్హం.

కాగా, రెండు గంటలపాటు రైలు నిలిచిపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. డ్రైవర్ ‌ విచారణకు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సింగ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
At a railway station in Patna, Bihar, hundreds of passengers aboard a local train were left to their own devices for as long as two hours after the train driver abandoned the train midway, for a cold shower to beat the heat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X