డేరా బాబా సీక్రెట్: పితాజీ మాఫీ అంటే రేప్, జైల్లో దర్జా
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆగడాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. అతనికి సంబంధించిన సంచలన విషయాలను ఇద్దరు సాధ్వీలు (అత్యాచారానికి గురైన మహిళలు) కోర్టులో వెల్లడించారు.
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆగడాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. అతనికి సంబంధించిన సంచలన విషయాలను ఇద్దరు సాధ్వీలు (అత్యాచారానికి గురైన మహిళలు) కోర్టులో వెల్లడించారు. తన ప్రత్యేక మందిరంలో అతను అత్యాచారాలకు పాల్పడేవారని చెప్పారు.
మహిళలపై అతను ఎలా అత్యాచారాలకు పాల్పడేవాడో కళ్లకు కట్టినట్లు వారు సిబిఐ కోర్టులో వివరించారు. గుర్మీత్‌కు గుఫా (ప్రత్యేక మందిరం) ఉండేదని, నచ్చిన మహిళలను అక్కడికి తీసుకుని వెళ్లి పలుమార్లు వారిపై అత్యాచారం చేసేవాడని చెప్పారు.
గుఫాకు మహిళా గార్డులు మాత్రమే కాపలా కాస్తుంటారని వారు చెప్పారు. పితాజీ మాఫీ అనే పదాన్ని అత్యాచారానికి ప్రత్యామ్నాయంగా వాడేవారని వారు చెప్పారు. సాక్షుల్లో ఒక్కరైన హర్యానాకు చెందిన మహిళ తాను 1999 జులై నుచి డేరాలో ఉంటున్నట్లు తెలిపారు.

అన్నను చంపేశారు...
తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్న తన అన్నను చంపేశారని హర్యానా బాధిత మహిళ సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మకు చెప్పారు. 1999 ఆగస్టులో గుర్మీత్ తనపై అత్యాచారం చేసేవరకు తనకు పితాజీ మాఫీ అంటే తనకు తెలియదని చెప్పారు.

ఇలా అడిగేవారు.....
అత్యాచారానికి గురి కాక ముందు డేరాలోని మహిళలంతా తనను పితాజీ మాఫీ జరిగిందా అని అడిగేవారని ఆ మహిళ చెప్పారు. 1999 సెప్టెంబర్ గుర్మీత్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మరో మహిళ చెప్పారు. ఈ విషయం బయటకు చెప్తే ప్రాణాలు పోతాయని గుర్మీత్ హెచ్చిరించినట్లు ఆమె తెలిపారు.

మినరల్ వాటర్, సేవకుడు.
గుర్మిత్ సింగ్ ప్రస్తుతం రోహతక్ జైల్లో ఉన్నాడు. ఆయనకు తాగేందుకు మినరల్ వాటర్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఓ సేవకుడిని కూడా నియోగించినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఆయనకు ఎసి ఉన్న సెల్ కేటాయించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తీర్పు వెలువడిన తర్వాత ఆయనను హెలికాప్టర్‌లో రోహితక్‌కు తరలించి ఓ గెస్ట్ హౌస్‌లో ఉంచారు. ఆ తర్వాత సాయంత్రం జైలుకు తరలించారు.

వార్తల్లో నిజం లేదు...
జైలులో గుర్మీత్‌కు ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు వస్తున్న వార్తలను హర్యానా జైళ్ల డిజి ఖండించారు. ఆయనకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు టీవీ చానెల్స్‌లో వార్తలు వచ్చాయని, అదంతా అవాస్తవమని అన్నారు. కేసు తీర్పు తర్వాత గుర్మీత్‌ను సునారియా జైలుకు తరలించామే గానీ గెస్ట్ హౌస్‌కు కాదని స్పష్టం చేశారు. అతన్ని జైలులో సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications