హనీప్రీత్ ఫస్ట్‌నైట్: భోజనం చేయలేదు, డేరా బాబాను కలవాలని...
జైలులో తొలి రోజు డేరా బాబా దత్త పుత్రికి హనీప్రీత్ సింగ్ నిద్రలేని రాత్రిని గడిపింది. జైలులో మొదటి రోజు రాత్రి పూట భోజనం కూడ చేయలేదు. హనీప్రీత్‌ను ఉంచిన సెల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంద
అంబాలా: జైలులో తొలి రోజు డేరా బాబా దత్త పుత్రికి హనీప్రీత్ సింగ్ నిద్రలేని రాత్రిని గడిపింది. జైలులో మొదటి రోజు రాత్రి పూట భోజనం కూడ చేయలేదు. హనీప్రీత్‌ను ఉంచిన సెల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారైనా తనకు డేరాబాబాను చూపాలని హనీప్రీత్ సింగ్ అధికారులను కోరారని సమాచారం.
డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ను పోలీసు కస్టడీ తర్వాత అంబాలాలోని జైలుకు తరలించారు. హనీప్రీత్‌తో పాటు సుఖ్‌దీప్‌కౌర్‌ను కూడ ఒకే సెల్‌లో ఉంచారు. మొదటి రోజు హనీప్రీత్, సుఖ్‌దీప్ కౌర్ ముభావంగానే ఉన్నారని జైలు అధికారులు చెప్పారు.
డేరాబాబాను అరెస్టు చేసిన సుమారు 40 రోజుల తర్వాత హనీప్రీత్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మరునాడే హనీప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిద్రలేని రాత్రి గడిపిన హనీప్రీత్ సింగ్
అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ అంబాలాలోని కేంద్ర కర్మాగారంలో తొలిరాత్రిని నిద్రలేకుండా గడిపినట్టు తెలిసింది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు పంపారు.ఇక జైల్లో తొలిరోజు ఆమె రాత్రి భోజనం స్వీకరించలేదని జైలు అధికారులు చెబుతున్నారు.
Recommended Video


డేరా బాబాను చూపాలని కోరిన హనీప్రీత్ సింగ్
జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్ ను చూపించాలని ఆమె అధికారులను వేడుకుందని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని, బీపీ పెరిగిందని ఆమె చెప్పినట్టు వెల్లడించారు.ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్ లో ఉంచారు.

టీ, రెండు బ్రెడ్ ముక్కలే
జైలు నిబంధనల ప్రకారంగా ఉదయం 6 గంటకే వారిని లేపామని, ఆపై స్నానం చేసినత తరువాత టీ, రెండు బ్రెడ్ ముక్కలు ఇచ్చామని వెల్లడించారు జైలు అధికారులు.జై అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు హనీప్రీత్ ను పరిశీలించారని అన్నారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని డాక్టర్లు చెప్పారని జైలు అధికారి ఒకరు తెలిపారు

హనీప్రీత్‌కు భారీ భద్రత
హనీప్రీత్‌తో పాటు ఆమె సహచరి సుఖ్ దీప్ కౌర్‌ను కూడ ఒకే బ్యారక్‌లో ఉంచారు. వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. అంబాలా ప్రాంతంలో డేరా మద్దతుదారులు వేలాదిగా ఉండటం, జైల్లోనూ వారికి అనుకూల వర్గాలు ఉండటంతో నిఘా పెంచామని అన్నారు.. ఇతర మహిళా ఖైదీలతో వారిని కలిపి ఉంచలేదని జైలు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications