రాజకీయాల్లోకి మహేష్ కత్తి?: పవన్‌ కల్యాణ్‌పై తేల్చేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదారబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అనే సందేహాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన చేస్తున్న విమర్శల నేపథ్యంలోనే ఆ అనుమానాలు తలెత్తాయి.

  మహేష్ కత్తిపై హైపర్ ఆది 'జబర్దస్త్' పంచ్ !

  పవన్ కల్యాణ్‌పైనే కాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. వారిద్దరిని ఆయన తోడు దొంగలుగా అభివర్ణించారు.

  మహేష్ కత్తి ఇలా అన్నారు..

  మహేష్ కత్తి ఇలా అన్నారు..

  శనివారం ఉదయం ఫేస్‌బుక్ మహేష్ కత్తి లైవ్‌లోకొచ్చాడు. ఓ నెటిజన్ చట్టసభల్లో మీలాంటి వారుండాలని కోరాడు. ఇందుకు ఆయన స్పందించారు. తన లాంటి వారు చట్టసభల్లో ఉండాలనుకోవడం తప్పు లేదని, సేవ చేయగలననే నమ్మకం తనకుందని చెప్పారు.

  దానికి జిగ్నేష్ ఉదాహరణ

  దానికి జిగ్నేష్ ఉదాహరణ

  తన లాంటి వారు రాజకీయాల్లోకి వస్తే ఎలా చేస్తాం, ఎలా ముందుకెళతామనే విషయానికి జిగ్నేష్ మేవాని ఉదాహరణ అని మహేష్ కత్తి అన్నారు. జిగ్నేష్‌ను ఆదర్శంగా తీసుకుని దళితుల్లో కొంతమందైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని కత్తి మహేశ్ అన్నారు.

  దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి..

  దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి..

  రాజకీయాల్లోకి రావాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని, అయితే ఆ ప్రణాళికను ఓ సైద్ధాంతిక ప్రాతిపదికన ఏర్పరచుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్లకూడదని ఆయన చెప్పారు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని కత్తి మహేశ్ చెప్పారు.

  జగన్‌తో వెళ్తారా...

  జగన్‌తో వెళ్తారా...


  కత్తి మహేష్ వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు పవన్ కల్యాణ్ వర్గం నుంచి వస్తున్నాయి. జగన్‌పై ఆయన విమర్శలు చేయకపోవడమే అందుకు కారణం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున చిత్తూరు నుంచి ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. అయితే దళిత దృక్పథం ఉన్న ఆయన అందుకు సిద్ధపడుతారా అనేది వేచి చూడాల్సింది.

  పొలిటికల్ సెటైర్ అందుకేనా...

  పొలిటికల్ సెటైర్ అందుకేనా...

  తాను ఈ ఏడాది ఓ సినిమా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైర్ అని ఆయన అన్నారు. అంటే ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై ఆ సినిమాను ఎక్కుపెడుతారా అనే సందేహం కలుగుతోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్‌కు వెళ్తున్నట్లు తెలిపారు.

  పవన్ కల్యాణ్ సిఎం కాలేడు..

  పవన్ కల్యాణ్ సిఎం కాలేడు..

  పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన మాటలను బట్టే అర్థమవుతోందని మహేష్ కత్తి అన్నారు. రాజకీయ చైతన్యం, సామాజిక నిబద్ధత ఉండాలని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరని జ్యోతిష్కుడు చెప్పిన విషయాన్ని నమ్మాల్సిన అవసరం లేదని, అది మనకు తెలిసిపోతోందని ఆయన అన్నారు. విమర్శనాత్మకంగా, చైతన్యం లేకుండా ఉన్నవారు ముందుకు సాగలేరని ఆయన అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It seems that Cine critic mahesh Kathi may enter into politics in Andhra Pradesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి