జగన్! ఏసు సభలు పెట్టు, మరొకరి వద్ద తలొంచను: మోత్కుపల్లి
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏసు సభ పేరిట వాడవాడలా సభలు పెట్టి, తాను అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పంచిపెట్టాలని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందిరాగాంధీ వంటి నేతనే గడగడలాడించిన నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు.

తెలంగాణలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మోత్కుపల్లి చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు అనుచరుడిగా పని చేసిన తాను, మరొకరి దగ్గర తలదించుకుని పని చేయగలనా? అని ప్రశ్నించారు.
జగన్ వద్ద చాలా డబ్బుందని, డబ్బులు ఉన్న వాడిని నమ్మవద్దని బైబిల్ చెబుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవంటే చాక్లెట్ కాదని, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని పొందలేరనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications