నంద్యాలలో పోస్టర్లు: 'ఏ పశుపతి ఆటలు సాగవ్.. జేజమ్మ అఖిలప్రియ'
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి దూసుకెళ్తోంది. పన్నెండు రౌండ్లు ముగిసేసరికి టిడిపి ఇరవై వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఉంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి దూసుకెళ్తోంది. పన్నెండు రౌండ్లు ముగిసేసరికి టిడిపి ఇరవై వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఉంది.
నంద్యాలలో టిడిపి సత్తా చాటిన నేపథ్యంలో భూమా అభిమానులు మంత్రి అఖిలప్రియపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, చాలామంది సోషల్ మీడియాలో ఆమెను నంద్యాల జేజమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు.

నంద్యాలలో టిడిపి శ్రేణులు మంత్రి అఖిలప్రియ ఫోటోతో ఓ పోస్టర్ పెట్టారు. అనుష్క నటించిన అరుంధతి ఫోటోలో.. మొహం స్థానంలో అఖిల మొహాన్ని ఉంచారు. వీటిని నంద్యాలలో చాలాచోట్ల అతికించారు. 'నంద్యాల జెజమ్మ, ఇక్కడ పశుపతి ఆటలు సాగవ్' అంటూ రాశారు.












Click it and Unblock the Notifications