చంద్రబాబు సమావేశాల్లో 'వణుకు': ఎందుకంటే....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశాలంటే అధికారులు వణికిపోతున్నారట. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకో తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు.
సచివాలయంలోని చంద్రబాబు చాంబరు, కాన్ఫరెన్సు హాలు, కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన ఉన్నంత సేపు ఎయిర్‌కండిషన్ 18 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుందట.

సమావేశాలు రెండు గంటలు తక్కువ కాకుండా...
చంద్రబాబు నిర్వహించే సమావేశం గానీ, సమీక్ష గానీ రెండు గంటలకు పైగానే సాగుతుంది. ఏ విషయం మీదనైనా స్పష్తత వచ్చే వరకు ఆయన వదిలిపెట్టరు. దానివల్ల సమావేశాలు గంటలపాటు సాగుతూనే ఉంటాయి. తర్వాతి సమావేశానికి హాజరుకావల్సిన అధికారులు షెడ్యూల్ ప్రకారం వచ్చేస్తుంటారు.

సుదీర్ఘ సమావేశాలతో అసహనం..
రాత్రి వరకూ చంద్రబాబు సమీక్షలు కొనసాగుతుండటంతో అధికారులు అసహనానికి గురవుతున్నారని చెబుతున్నారు. ఏసి 18 డిగ్రీల సెల్సియస్‌లో ఉండటంతో అధికారులు వణికిపోతున్నారు. అంతటి చలిలో ఉండి, బయటకు వణికిపోతూ వస్తున్న దృశ్యాలు సాధారణమై పోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

చంద్రబాబుకు చెప్పే దైర్యం లేక...
రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షా సమావేశాల్లో కూర్చుని మర్నాడు ఉదయమే లేచి అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం సంకటకంగానే ఉందని అంటున్నారు. ఈ విషయం చంద్రబాబుకు చెప్పేవారు లేకుండా పోయారని అధికారులు బయట ఉన్న మీడియా వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు.

దాదాపు నాలుగు గంటల పాటు
మంగళవారం నిర్వహించిన విభాగాధిపతుల సమావేశం దాదాపు నాలుగుగంటలు జరిగింది. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మూడుగంటల సేపు జరిగింది. ఆ సమావేశాలు కాకుండా మధ్య మధ్యలో అధికారులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications