డేరా బాబాకు పద్మ అవార్డు ఇవ్వాలని 4200 మంది ప్రతిపాదన
అత్యాచారం చేసి జైలు పాలైన డేరాబాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పలువురు ప్రతిపాదనలు పంపించడం సంచలనం రేపింది.
న్యూఢిల్లీ: అత్యాచారం చేసి జైలు పాలైన డేరాబాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పలువురు ప్రతిపాదనలు పంపించడం సంచలనం రేపింది.
రేపిస్టు అయిన డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారిస్తూ అతనికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 18,768 దరఖాస్తులు రాగా వాటిలో రేపిస్టు గుర్మిత్ పేరును ఎక్కువమంది ప్రతిపాదించడం వివాదాస్పదంగా మారింది.
రేపిస్టు డేరాబాబా పేరు ప్రతిపాదిస్తూ 4,208 దరఖాస్తులు హోంమంత్రిత్వ శాఖకు వచ్చాయి. డేరా సంస్థ కేంద్రమైన సిర్సా పట్టణం నుంచి ఎక్కువమంది గుర్మిత్ పేరును పద్మ అవార్డుకు ప్రతిపాదించారు.
ఇందులో సిర్సా నుంచి అమిత్ అనే వ్యక్తి అయితే ఏకంగా 31 దరఖాస్తులను పంపించాడు. సునీల్ మరో భక్తుడు.. డేరాబాబా పేరిట 27 ప్రతిపాదనలు పంపించాడు. రేపిస్టు అయిన డేరాబాబాకు పౌరులు అభా, ఆదిత్య, అక్బర్, బల్జిందర్, మిల్కీ, కోమల్, జోని, జెస్సీ, ఈశ్వర్ లని సంబోధిస్తూ పద్మ అవార్డుకు నామినేషన్లు పంపారు.
డేరాబాబా పుట్టిన గంగానగర్ నుంచీ దరఖాస్తులు వచ్చాయి. రేపిస్టు పేరును అత్యున్నత పద్మ పురస్కారం కోసం ఎక్కువ మంది పౌరులు ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications