జగన్‌ను దెబ్బ తీసిన పవన్ కల్యాణ్ ప్రతివ్యూహం

Posted By:
Subscribe to Oneindia Telugu
జగన్‌ను దెబ్బ తీసిన పవన్

అమరావతి: పోలవరం ప్రాజెక్టు అనేది ఇప్పుడు వేడి వేడి అంశంగా మారింది. ప్రతి రోజూ ఏదో విధంగా పోలవరం ప్రాజెక్టు చర్చలోకి వస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని చిక్కుల్లో పడేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భావంచారు.

అందులో భాగంగా తన పార్టీ ప్రతినిధుల బృందాన్ని పోలవరం ప్రాజెక్టు సందర్సనకు పంపించారు. అయితే జగన్ వ్యూహాన్ని చాలా వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెబ్బ తీశారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందం, పవన్ కల్యాణ్ ఒకే రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

ఇలా ఒకే రోజు యాత్ర

ఇలా ఒకే రోజు యాత్ర

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందం ఈ నెల 7వ తేదీన పోలవరం యాత్ర చేపట్టింది. అదే రోజు పవన్ కల్యాణ్ కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాము పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నట్లు వైయస్సార్ర్ కాంగ్రెసు పార్టీ నాయకులు ముందు ప్రకటించారు. తాను కూడా అదే రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఇలా మార్చుకున్న పవన్ కల్యాణ్

ఇలా మార్చుకున్న పవన్ కల్యాణ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందం వచ్చి వెళ్లిన తర్వాత పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టు చెంతకు వస్తారని జనసేన మొదట ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే, ఏడో తేదీకి ముందు రోజు అకస్మాత్తుగా పవన్ కల్యాణ్ షెడ్యూల్ మారింది. అదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసిది.

పవన్ ఇలా చేశారు...

పవన్ ఇలా చేశారు...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల బృందం గుంటూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి పోలవరం చేరుకుంటుందని జనసేన పార్టీక సమాచారం అందింది. దాంతో పవన్ కల్యాణ్ వారికన్నా ముందుగా పోలవరం చేరుకోవడానికి పవన్ కల్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేయడంతో పవన్ కల్యాణ్ ఆ రోజు ఉదయమే అక్కడికి చేరుకున్నారు.

చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు...

చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎలాగూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు కాబట్టి ఆ అవకాశాన్ని పవన్ కల్యాణ్ తానే తీసుకుని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ అది వ్యూహాత్మకంగానే జరిగిందని అంటున్నారు.

ఆ తర్వాత వైసిపి నేతలు వచ్చారు...

ఆ తర్వాత వైసిపి నేతలు వచ్చారు...

పవన్ కల్యాణ్ పర్యటన ముగిసిన తర్వాత మధ్యాహ్నానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్సలు చేయడానికి వారికి ఏమీ మిగలేదు. చేయాల్సిన విమర్సలన్నీ చేసేసి పవన్ కల్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాన్ని దెబ్బ తీశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan conter strategy to the YSR Congress party srategy has worked on Polavaram Project issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి