వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయబరేలి నుంచి ఎవరు: ప్రియాంక దిగుతారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోనియా గాంధీ మాటలను బట్టి ఆమె తన భవిష్యత్తును నిర్ణయించుకున్నట్లే కనిపిస్తున్నారు. కాంగ్రెసు నేతలు కాదంటునప్పటికీ ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారనే వాదనకే బలం చేకూరుతుంది.

Recommended Video

సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్‌బై

కాంగ్రెసు అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్న సోనియా గాంధీ రాయబరేలీ సీటును ఏం చేస్తారనే విషయంపై చర్చ సాగుతోంది. రాయబరేలీ నుంచి సోనియా గాంధీ కాకపోతే ఎవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

ఏం చేస్తారంటే సోనియా ఇలా...

ఏం చేస్తారంటే సోనియా ఇలా...

శనివారం రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంటు నుంచి బయటకు వస్తున్న సోనియాను అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కొందరు ఓ ప్రశ్న వేశారు. రాహుల్‌ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించారు. అందుకు ఆమె ఇక మిగిలింది రాజకీయాల నుంచి తప్పుకోవడమే కదా అన్నారు. దీంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

వెంటనే రణదీప్ సూర్జేవాల్ ఇలా...

వెంటనే రణదీప్ సూర్జేవాల్ ఇలా...

కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల్‌ ట్విటర్‌లో ఈ చర్చలకు పుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదని కేవలం అధ్యక్ష బాధ్యతల నుంచే వైదొలుగుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని చెప్పారు.

రాయబరేలి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది..

రాయబరేలి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది..

సోనియా రాజకీయాల నుంచి తప్పుకుటే ప్రస్తుతం కొనసాగుతున్న రాయ్‌బరేలీ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ప్రశ్నగానే మిగిలింది. తొలిసారి రాయ్‌బరేలీలో నాటి కాంగ్రెస్‌ పార్టీ నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసి అప్పటి భారతీయ లోక్‌ దల్‌ పార్టీకి చెందిన రాజ్‌ నారాయణ్‌ చేతిలో 1977లో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తూనే వస్తోంది. 1996, 1998లో మాత్రం బీజేపీ రాయ్‌బరేలీలో విజయం సాధించింది. తొలిసారి 1999 కెప్టెన్‌ సతీష్‌ శర్మను బరిలోకి దించి కాంగ్రెసు విజయం సాధించింది. ఆ తర్వాత దాన్ని కంచుకోటగా మార్చుకుంది.

సోనియా తొలిసారి ఇలా...

సోనియా తొలిసారి ఇలా...

తొలిసారి సోనియాగాంధీ 2004లో రాయ్‌బరేలీలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఆమెనే గెలుస్తూ వస్తున్నారు. 2014లో సైతం సోనియా విజయం సాధించి ప్రస్తుతం లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇప్పుడు సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే రాయ్‌బరేలీలో బరిలోకి దిగేదెవరు అని ప్రశ్న ఉదయిస్తోంది.

అక్కడి నుంచి ప్రియాంకను దింపుతారా..

అక్కడి నుంచి ప్రియాంకను దింపుతారా..

సోనియా కుటుంబానికి చెందినవారే పోటీ చేయాలనుకుంటే రాహుల్‌ అమేథి నుంచి ఉన్నారు కాబట్టి ప్రియాంక రాయబరేలీ నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆమె ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. రాబర్ట్ వాద్రాను దించుతారా అని ప్రశ్నిస్తే ఆయన ఆరోపణలు ఎదుర్కుంటున్న దృష్ట్యా విజయం సాధ్యమవుతుందా అనేది కూడా ప్రశ్నే.

English summary
If Sonia Gandhi retire from politics, will Priyanka Vadra contest fron Raibareli?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X