పైశాచికం: ఆవుదూడపై లైంగిక దాడి, అక్కడే లోదుస్తులు
నాగులగూడెంలో తన పొలంలో కట్టివేసి ఉన్న ఆవుదూడపై శుక్రవారం రాత్రి కొందరు యువకులు పైశాచికత్వంతో లైంగిక దాడికి ఒడిగట్టారని ఆనంద్ రెడ్డి అనే రైతు ఆరోపించారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో తన పొలంలో కట్టివేసి ఉన్న ఆవుదూడపై శుక్రవారం రాత్రి కొందరు యువకులు పైశాచికత్వంతో లైంగిక దాడికి ఒడిగట్టారని ఆనంద్ రెడ్డి అనే రైతు ఆరోపించారు.
సంఘటనా స్థలంలో నిందుతులకు సంబంధించిన లోదుస్తులు ఉన్నాయి. ఆవుదూడపై అఘాయిత్యానికి పాల్పడటంతోపాటు పక్కనే ఉన్న రబ్బరు ట్యూబుతో తీవ్రంగా గాయపరిచారు.

శనివారం ఉదయం గమనించిన ఆనంద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పోలీసులు సంఘటనా స్థలంలోకి వచ్చి నిందితుల ఆనవాళ్లను స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను తీసుకువచ్చి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications