జగన్ పాదయాత్రకు 'భారీ వర్షాలు' షాక్!: బాబు వస్తే వర్షాలుండవా, సంతోషం!

Posted By:
Subscribe to Oneindia Telugu
  జగన్ పాదయాత్రకు లేని రైతు స్పందన : భారీ వర్షాల షాక్!

  అమరావతి: సమైక్య ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్షాభావం ఉండేది. ఈ నేపథ్యంలో చంద్రబాబు -కరువు కవల పిల్లలు అని నాడు వైయస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు విభజిత ఏపీలో వైసిపి విమర్శలు గుప్పించింది.

  అక్కడే ట్విస్ట్: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, ఆత్మరక్షణలో జగన్, అందుకే

  వైసిపి అధినేత వైయస్ జగన్, ఎమ్మెల్యే రోజా సహా ఆ పార్టీ నేతలు నిన్నటి దాకా నిత్యం బాబు - కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు కరువు జిల్లా అనంతపురం, కడప, కర్నూలు సహా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

   జగన్ విమర్శలను ప్రకృతి కూడా జీర్ణించుకోలేకపోతోంది

  జగన్ విమర్శలను ప్రకృతి కూడా జీర్ణించుకోలేకపోతోంది

  చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని, అలాంటి నాయకుడిపై వైసిపి విమర్శలు చేయడాన్ని ప్రకృతి కూడా జీర్ణించుకోలేకపోతోందని, అందుకే కరువు జిల్లా అనంతలోను విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

   వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా

  వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా

  వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వరుణుడు మా పార్టీలోనే శాశ్వతంగా ఉంటారని, వర్షాలొచ్చినా బాబుకు ఏడుపేనని వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. కానీ గత కొద్దిరోజుల నుంచీ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తోన్న భారీ వర్షాలు, నిండిపోతున్న చెరువులు, రిజర్వాయర్లు బాబుపై ఉన్న ఈ విమర్శలకు తెరదించాయి.

   టిడిపి ఎదురుదాడి, సానుకూల ఫలితం

  టిడిపి ఎదురుదాడి, సానుకూల ఫలితం

  ప్రధానంగా కరవుతో అల్లాడిపోతున్న రాయలసీమలో కూడా గతంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదు కావడంతో వైసిపి సహా విపక్షాల విమర్శలకు తెరపడినట్టయింది. దీనిపై బాబు వస్తే వర్షాలు రావని చెప్పిందెవరంటూ టిడిపి గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న ఎదురు దాడి సానుకూల ప్రచారం ఫలితాలిస్తోంది.

   అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు

  అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు

  దేశంలో రాజస్తాన్ తర్వాత అత్యంత కరవుప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఈసారి ఏకంగా వరదలు రావడం రైతాంగాన్ని సంతోషపరిచింది. గతంలో కర్నూలు జిల్లాలో కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చిన దాఖలాలున్నప్పటికీ, అనంతపురంలో మాత్రం భారీ వర్షాలు వచ్చి, చెరువులు నిండిన వైనం లేకపోవడం గమనార్హం. గత నెల తొలి వారం వరకూ రాయలసీమలో 537.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఇంకా 216.7 మిల్లీమీటర్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

   కోస్తాలోను వర్షాలు

  కోస్తాలోను వర్షాలు

  కోస్తాజిల్లాల్లో గత నెలలో 526.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, తాజాగా 688.13 మిల్లీ మీటర్లు నమోదయింది. అంటే 161.4 మిల్లీమీటర్లు ఎక్కువ వర్షపాతం నమోదయింది. గత నెల తొలివారంలో రాష్ట్రంలో మొత్తం 449.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాజాగా అది 180 మిల్లీమీటర్లు అదనంగా, అంటే 629.8 మిల్లీమీటర్లకు చేరింది.

   భూగర్భ జలాలు ఇంకిపోయిన రాయలసీమలో ఆనందం

  భూగర్భ జలాలు ఇంకిపోయిన రాయలసీమలో ఆనందం

  భారీగా కురుస్తోన్న వర్షాల ప్రభావం భూగర్భజలాలపైనా పడుతోంది. ఇది నీరు లేక భూమి వైపు తొంగి చూస్తున్న రైతులకు ఊరటగా మారింది. ప్రధానంగా రాయలసీమలో ఇంకిపోయిన భూగర్భజలాల మట్టాలు పైకి వస్తుండటం రైతులకు ఆనందం కలిగిస్తోంది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 19.66 మీటర్ల లోతున్న భూగర్భజలాలు గత కొద్దిరోజుల నుంచి 4.60 మీటర్లకు పెరిగి, 14.97 మీటర్లకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 12.34 మీటర్ల లోతున్న భూగర్భజలాలు, తాజాగా 2.24 మీటర్లకు పెరిగి 10.1 మీటర్లకు చేరుకున్నాయి.

   చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా చెరువులు నిండాయి

  చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా చెరువులు నిండాయి

  నదుల అనుసంధానం ద్వారా పట్టిసీమ నుంచి ఇప్పటికి 71 టిఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకురావడం ద్వారా రైతు పంటలు కాపాడగలిగారు. అనంత జిల్లా శింగనమలైలో వర్షాలతో చరిత్రలో ఎప్పుడూ లేనట్లు చెరువులు నిండాయి. వర్షాలు తక్కువగా ఉండే శ్రీకాకుళంలో కూడా కుంటలు, చెరువులు నిండాయి. శ్రీశైలం కూడా నిండుతోంది.

   రంగంలోకి దిగిన టిడిపి

  రంగంలోకి దిగిన టిడిపి

  ఈ వర్షాలను టిడిపి తనకు అనుకూలంగా మలచుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా బాబు వస్తే వర్షాలు రావని చెప్పిందెవరు అంటూ వైసిపి సహా విపక్షాలపై ఎదురుదాడికి దిగుతోంది. అంతేకాదు, బాబు ఫొటోతో వర్షపాతం వివరాలు, ఆ ఫొటోలను వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరవేస్తోంది. అందుకు గత నెలరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కాంగ్రెస్ హయాంలో సీమలో ఎప్పుడూ నిండని కుంటలు, చెరువులు, రిజర్వాయర్లను తమ వాదనకు మద్దతుగా చూపిస్తోంది.

   జగన్ పాదయాత్రకు మద్దతు లభించదని టిడిపి అంచనా

  జగన్ పాదయాత్రకు మద్దతు లభించదని టిడిపి అంచనా

  దశాబ్దాల నుంచి వైయస్ కుటుంబమే పెత్తనం చేస్తోన్న పులివెందులకూ తామే నీళ్లిచ్చామని, వర్షాలు పడి, రైతులు ఆనందంతో ఉంటే వైసిపి బాధపడుతోందన్న ఎదురుదాడికి దిగుతోందని టిడిపి ఎద్దేవా చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో నవంబర్ 2 నుంచి జగన్ చేయనున్న పాదయాత్రకు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నుంచి పెద్దగా స్పందన లభించదని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొద్దిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల ఫలితంగా రైతులు పొలం పనులపైనే దృష్టి సారిస్తున్నారు. జనవరి వరకూ రైతులు పొలం పనులకు తప్ప మిగిలిన వ్యవహారాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అందువల్ల జగన్ పాదయాత్రకు రైతు స్పందన అంతగా ఉండదని భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party is very happy with heavy rains in Andhra Pradesh and Rayalaseema.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి