హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: జీహెచ్ఎంసీ తరలించిన యాచకుల్లో కోటీశ్వరులు!

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో నరగంలోని యాచకులందర్నీ నగర శివారుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, యాచకుల తరలింపులో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rich and Educated Women Beggars Found Ahead of Ivanka’s Hyderabad Visit | Oneindia Telugu

హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో నరగంలోని యాచకులందర్నీ నగర శివారుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, యాచకుల తరలింపులో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

చర్లపల్లి జైలులోని ఆనందాశ్రమానికి చేరిన ఇద్దరు యాచకులను విచారించగా వాళ్లు కోటీశ్వరులని తేలింది. లంగర్‌హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తుండగా.. జీహెచ్‌ఎంసీ అధికారులు తమను ఇక్కడికి తీసుకొచ్చారని రూబియా, ఫర్జానా అనే ఇద్దరు ధనవంతులైన మహిళలు జైలు అధికారులకు తెలిపారు.

Two ‘rich, educated women’ among beggars shifted to rehab ahead of Ivanka’s Hyderabad visit: Cops

తాను ఇంగ్లాండ్‌లో ఉంటున్నాననీ.. తనకు ఆస్తి పాస్తులున్నాయని.. మొక్కు తీర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చానని రూబియా చెప్పారు. రూ.కోట్ల ఆస్తిని బంధువులకు అప్పజెప్పినట్టు ఫర్జానా తెలిపారు. తాను అమెరికాలో ఉంటున్నాని తెలిపారు.

మనోవేదన నుంచి బయటపడేందుకు ఇక్కడకు వచ్చి దర్గా దగ్గర భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని ఆమె వివరించారు. ఇద్దరూ హైదరాబాద్‌కు చెందినవారేనని అధికారుల విచారణలో తేలింది. వారిద్దరి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

English summary
Authorities have said two women shifted by the Hyderabad Police to rehabilitation centres as part of their efforts to make the city beggar-free ahead of the visit of Ivanka Trump, the daughter of US president Donald Trump, are educated and own properties in posh areas of the Telangana capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X