విశాఖలో వింత జీవులు: మనుషుల్లాగే నిలుచుని!.. వైరల్ 'వీడియో'
విశాఖలో వింత జీవులు కలకలం రేపుతున్నాయి. రూపంలో పక్షులను తలపిస్తున్నా.. అచ్చు మనుషుల్లా నిలుచుని ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.ఓ భవన నిర్మాణంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు వీటిని గుర్తించారు.
విశాఖపట్నం: విశాఖలో వింత జీవులు కలకలం రేపుతున్నాయి. రూపంలో పక్షులను తలపిస్తున్నా.. అచ్చు మనుషుల్లా నిలుచుని ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.
ఓ భవన నిర్మాణంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు వీటిని గుర్తించారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. వీడియో తీస్తున్నట్టు గమనిస్తున్నా.. అవి ఏమాత్రం తొణకకుండా అలాగే నిలుచుని ఉన్నాయి.
మూడు వింత ఆకారాల్లో ఒకటి మాత్రమే కనిపించగా.. మరొకటి వాటి వెనుక దాగి ఉంది. అవి గుడ్లగూబ పిల్లలను పోలి ఉన్నట్టు కనిపిస్తుండటంతో.. పిల్ల గుడ్లగూబలు అయి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications