షేమ్.. షేమ్: నటి శ్రీదేవి మృతిపై కాంగ్రెస్, అవమానం... నెటిజన్ల ఆగ్రహం
Recommended Video

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి శ్రీదేవి మృతిపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హఠాన్మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన పూర్తి ట్వీట్ చదివిన తర్వాత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడటంతో ఆ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. శ్రీదేవి మృతికి సంతాపం తెలపడం ఓకే.. కానీ తామే అవార్డు ఇచ్చామని ప్రకటించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌లో ఏముందంటే
శ్రీదేవి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, తన నటనతో అందరి గుండెల్లో నిలిచిపోయారని, ఆమె మృతికి తమ ప్రగాఢ సానుభూతి అని ఆ పార్టీ చేసిన ట్వీట్‌లో ఉంది. ఆ తర్వాత ఆమెకు వచ్చిన పద్మ అవార్డు గురించి పేర్కొనడం గమనార్హం. 2013లో యూపీఏ హయాంలో ఆమెకు పద్మశ్రీ వచ్చిందని పేర్కొన్నారు.

ఈ కారణంతో నెటిజన్ల ఆగ్రహం
ఓ వైపు ఆమె చనిపోయి, దుఃఖం లేదా అభిమానులు, అందరూ విచారంలో ఉన్న సమయంలో తమ హయాంలో శ్రీదేవికి పద్మశ్రీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం విచారకరమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాంలో పుట్టి, బీజేపీ హయాంలో మృతి
కాంగ్రెస్, రాహుల్ గాంధీలు ఇలాంటి సమయంలో నిజంగానే మానత్వంతో ట్వీట్ చేశారా అని ఓ ట్విట్టరిటీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలా ట్వీట్ చేయడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. శ్రీదేవి కాంగ్రెస్ హయాంలో జన్మించి, బీజేపీ హయాంలో మృతి చెందిందని, ఇది మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని కాంగ్రెస్ చెబుతుందేమోనని మరొకరు ట్వీట్ చేశారు.
ఇదీ కాంగ్రెస్ తీరు
సందీప్ ఘోస్ స్పందిస్తూ.. మేమే ఇచ్చామన్నట్లుగా చెబుతున్నారని, కానీ పద్మ అవార్డులు భారత ప్రభుత్వం సిటిజన్లకు ఇస్తుందని, కానీ ఓ రాజకీయ పార్టీ ఇవ్వదని, దీనిని బట్టి కాంగ్రెస్ తీరు అర్థమవుతోందని పేర్కొన్నారు.

ఇది తీవ్ర అవమానకరం
కార్తీక్ స్పందిస్తూ.. సంతాప సందేశంలో ఇలాంటిది చెప్పడం అవసరమా అని ప్రశ్నించారు. రవీంద్ర జడెజా అనే నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి సమయంలో రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు. మాననత్వం లేకుండా మాట్లాడుతున్నారని, ఇది తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌పై నిప్పులు
కాంగ్రెస్ నేత ప్రధానిగా ఉన్నప్పుడు పుట్టిన శ్రీదేవి, బీజేపీ హయాంలో మృతి చెందిందని చెప్పలేదని ఒకరు, కాంగ్రెస్ పేర్కొన్న దాంట్లో చిన్న కరెక్షన్ అని, శ్రీదేవికి పద్మశ్రీ భారత ప్రభుత్వం ఇచ్చిందని, యూపీఏ ప్రభుత్వం కాదని, రాజకీయం సరికాదని మరొకరు, శ్రీదేవికి పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నమాట, యూ స్టూపిడ్, ఇచ్చింది కేంద్రం అని ఇంకొకరు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications