కోదండరామ్ పార్టీ గుర్తు బాణం: టచ్‌లో తెరాస నేతలు
న్యూఢిల్లీ: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తెలంగాణ జన సమితి పేరుతో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు.
పార్టీ ఎన్నికల గుర్తుగా బాణం కేటాయించాలని ఆయన ఈసిని కోరినట్లు తెలుస్తోంది. కోదండరామ్ పార్టీ పేరు ఈసీ పరిశీలనలో ఉంది. దానికి ఈసి సానుకూలంగా ప్రతిస్పందించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

యోగేంద్ర యాదవ్‌తో రహస్య చర్చలు
కోదండరామ్ జట్టు జాతీయ ఎన్నికల నిపుణుడు యోగేంద్ర యాదవ్‌తో పలు మార్లు రహస్య చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తన సన్నిహితులతో కోదండరామ్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ పేరు అధికారికంగా వచ్చిన తర్వాత భారీ బహిరంగ సభలు పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా కోదండరామ్ వ్యూహం
టిఆర్ఎస్‌ను స్థాపించినప్పుడు మద్దతు ఇచ్చిన వ్యక్తులతో, సంస్థలతో కోదండరామ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్‌ను స్థాపించినప్పుడు కేసిఆర్‌కు సన్నిహితంగా ఉన్న గాదె ఇన్నయ్యవంటివారు ఇప్పుడు కోదండరామ్ పార్టీ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు.

టీఆర్ఎస్ నేతలతో చర్చలు...
ప్రస్తుత టిఆర్ఎస్ నేతలు పలువురు కోదండరామ్‌తో రహస్యంగా మైత్రి కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిజెఎసికి, కోదండరామ్ పెట్టబోయే పార్టీకి టిఆర్ఎస్‌లోని కొంత మంది సహకారం అందిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నూతన పార్టీ ఆవిర్భావం ఏర్పాట్లు చూడడానికి 200 మందితో ఓ కమిటీ ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications