ప్రశాంతమైన నిద్ర కావాలా....ఇలా చేస్తే ఇక ఖచ్చితంగా..!!
సంపూర్ణ ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర చాలా ముఖ్యం. కొన్ని పొరపాట్లతో మనల్ని సుఖ నిద్రకు దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. పెద్దలు కూడా రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాలని సెంటర్స్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం పేర్కొంది. నిద్రకు దూరం కావటానికి కొన్ని అపోహలు కూడా కారణం. వీటిని వీడితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
రాత్రిపూట మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని కొందరు అపోహతో ఉంటారు. కానీ, దీంతో ముంచుకొచ్చే మత్తు తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. అధిక మొత్తంలో మద్యం సేవించే వ్యక్తుల్లో నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది. నైట్ షిఫ్టుల రీత్యా రాత్రుళ్లు పూర్తిగా నిద్ర లేక పోవడం, లేదంటే ఆలస్యంగా పడుకోవడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. రోజు ఇదే రొటీన్ గా కొనసాగిస్తే మాత్రం డిప్రెషన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే నిద్రకంటూ ఒక సమయం కేటాయించుకోవడం, అది కూడా రాత్రి సమయమే సరైనదని సూచిస్తున్నారు. కొంతమందికి బెడ్ పైన పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. అదే మరికొంత మంది అయితే నిద్ర కోసం పాట్లు పడుతుంటారు.

స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా.. పుస్తకం చదవడం, మసక వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చేయడం మంచిదని అధ్యయనం పేర్కొంది. గ్యాడ్జెట్స్‌తో గడపడం, టీవీ చూడడం అనేవి నిద్రను ప్రేరేపించవని, దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఇలా కాసేపు రిలాక్స్ అయ్యారంటే ఎంచక్కా నిద్ర దానంతటదే వస్తుందని, ఆపై హాయిగా పడుకోవచ్చని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఒకే నిద్ర సమయాన్ని పాటించండి, నిద్రవేళకు ముందు వెచ్చని స్నానం వంటి విశ్రాంతి దినచర్యను అలవాటు చేసుకోండి, వ్యాయామం చేయండి మరియు నిద్రను ప్రభావితం చేసే కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి. మంచి నిద్ర ద్వారా బాడీకి తిరిగి శక్తి అందటమే కాకుండా.. ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేస్తుంది.












Click it and Unblock the Notifications