రాత్రిపూట ఈ ఒక్క తప్పు చేయొద్దు.. పొట్ట గుట్టవుతుంది
ప్రస్తుతం అందరి జీవితం బిజీగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయేవరకు బిజీ బిజీ. దీనివల్ల ఎక్కువమంది సమయానికి భోజనం చేయడంలేదు. మరికొందరు పగలంతా కష్టపడి ఉండటంతో సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నామనే భావనతో ఎక్కువగా తిని విశ్రాంతి తీసుకుంటారు. ఇలా చేయడంవల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడటమే కాకుండా విపరీతమైన బరువు పెరుగుతున్నారు. రాత్రి మనం డిన్నర్ తీసుకునే సమయంలో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు బరువును పెంచుతున్నాయి.
ఐదు అలవాట్లు మానుకోవాలి
రాత్రి భోజనం చేసిన తర్వాత ఎక్కువమందికి ఐదు అలవాట్లు ఉంటాయి. వాటిని మానేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు రాత్రి భోజనం చేసిన తర్వాత కాఫీ తాగుతున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల నిద్ర సరిగా పట్టదు. ఆ ప్రభావం బరువుపై పడి ఊబకాయం పెరిగేలా చేస్తుంది. గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ చాలామంది రాత్రి అన్నం తిన్నతర్వాత తాగుతుంటారు. అలా తీసుకుంటే నిద్రకు భంగం వాటిల్లడంతోపాటు జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలను శరీరం తీసుకోనివ్వకుండా చేస్తుంది.

మంచినీరు వెంటనే తాగకూడదు
మంచినీరు తాగడం చాలా మంచిదే. అయితే రాత్రి అన్నం తిన్న తర్వాత ఎక్కువ మంది అధికంగా నీరు తాగుతుంటారు. ఆయుర్వేదం ప్రకారం అన్నం తినేటప్పుడు, అన్నం తిన్న తర్వాత కొంత సమయం వరకు మంచినీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉంటుంది. నీరు తాగితే ఆటంకం కలుగుతుంది. తిన్న తర్వాత 30 నిముషాల సమయం ఉండి అప్పుడు నీరు తాగాలి. రాత్రివేళ అన్నం తిన్నవెంటనే చాలామంది మంచంపై వాలిపోతారు. అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం జీర్ణమవ్వాలంటే కనీసం పావుగంట సమయం నడవాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే అపానవాయువు దెబ్బతిని బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications