వాము- మెంతుల్లో ఏది బెటర్?- ఓ లుక్కేయండి

ఆహారం జీర్ణం కావడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి వాడే వంటింటి చిట్కాలలో వాము (అజ్వైన్), మెంతకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బాగా ఉపయోగపడుతుంది? ఈ రెండింటి ప్రయోజనాలు, వీటిని బాగా నానబెట్టి లేదా మరిగించిన నీటిని ఎప్పుడు తాగాలి? కొవ్వును తగ్గించడానికి ఏది మంచిది అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

వాము వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు..

వాము జీర్ణశక్తిని మెరుగుపర్చడంలో అద్భుతంగా పని చేస్తుంది. దీన్ని నానబెట్టడం లేదా మరిగించడం ద్వారా తయారయ్యే నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాములో థైమోల్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియ, జీవక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీవక్రియ మెరుగుపడటం వల్ల శరీరం కొవ్వును సమర్థవంతంగా, తగిన మోతాదులో ఉపయోగించుకుంటుంది. ఫలితంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఖాళీ కడుపుతో వాము నీటిని తాగడం మంచిది.

మెంతి వాటర్..

మెంతుల్లో పీచు అధికంగా ఉంటుంది. ఆకలిని నియంత్రించగలుగుతుంది. తద్వారా అనవసరమైన చిరుతిళ్ళను తగ్గించుకోవచ్చు. అలాగే- రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా మెంతి నీటిని తీసుకోవడం వల్ల ప్రేగులకూ చాలా మంచిది. వాటి పనితీరు ఎంతగానో మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన మెంతిని ఉదయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

బరువు తగ్గడానికి ఏది మంచిది?

వాము, మెంతి నీరు రెండింటికీ వాటికవే ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. జీవక్రియ మందగించడం, అజీర్ణం లేదా తరచుగా ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి వామునీరు బాగా పనిచేస్తుంది. దినచర్యల్లో భాగంగా చక్కెరను ఎక్కువగా తీసుకునే వారికి మెంతి నీరు చాలా బెటర్.

రెండింటినీ కలిపి తీసుకోవచ్చా?

ఈ రెండింటినీ కలిపి తీసుకోవచ్చు. చాలా మంది వాము, మెంతి నీటిని వారంలో మార్చి మార్చి తీసుకుంటుంటారు. దీనివల్ల శరీరానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల అధిక ప్రోటీన్, పీచుపదార్థాలు ఉన్న సమతుల్య ఆహారం లభించినట్టవుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర అవసరం.

ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. అజ్వైన్, మెంతి నీరు బరువు నియంత్రణకు సహకరిస్తాయి. ఫలితాలు- దాన్ని ఉపయోగించే వ్యక్తి ఆహారపు అలవాట్లను బట్టి మారుతూ ఉంటాయి. వీటిని వాడటానికి ముందు డాక్టర్లను సంప్రదించడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+