మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా!

సహజంగా మనమంతా ఆల్కాహాల్ అంటే మద్యం అని భావిస్తాం. కానీ మనం ప్రతిరోజు తినే కొన్ని ఆహారాలలో చాలా స్వల్ప మోతాదులో సహజంగా ఆల్కహాల్ ఉంటుంది. ఇది హానికరం కానప్పటికీ, ఇది పూర్తిగా సహజ ప్రక్రియ వల్ల ఏర్పడుతుంది. కనుక మనకు తెలీకుండానే మనం దీనిని తీసుకుంటాం. మనకు తెలియకుండానే మనం తినే ఆహారాలలో ఆల్కహాల్ ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.

పండ్లు

అత్యధికంగా పండిన పండ్లలో సహజ ఫర్మెంటేషన్ వల్ల కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది. అటువంటి పండ్లలో ఆపిల్, అరటిపండు, ద్రాక్ష పండ్లు ముఖ్యమైనవి. వీటిలో కొద్దిగా ఆల్కహాల్ ఏర్పడుతుంది.

alcohol in Foods these foods have hidden Natural Alcohol Content And Fermented Items too have alcohol

పెరుగు మరియు ఫర్మెంటేషన్ చేసిన ఆహారాలు

పెరుగులో కొద్దిగా ఆల్కహాల్ ఏర్పడుతుంది. పాలను వేడి చేసే తోడు పెట్టి పెరుగుగా మార్చే క్రమంలో అందులో ఈస్ట్ ఏర్పడడం వల్ల అందులో ఆల్కహాల్ వస్తుంది. అంతేకాదు ఇడ్లీ, దోశ తదితర పిండిని కూడా ఫర్మెంట్ చేయడం వల్ల అందులో స్వల్ప ఎథనాల్ తయారవుతుంది.

బ్రెడ్, బ్రెడ్ తో తయారు చేసే పదార్థాలు

బ్రెడ్ ను ఈస్ట్ ను ఉపయోగించి తయారు చేస్తారు కాబట్టి, తయారీ సమయంలో కొద్దిగా ఆల్కహాల్ ఏర్పడుతుంది. కానీ దీనిని కాల్చే సమయంలో చాలా భాగం ఆవిరి అయిపోతుంది. బ్రెడ్ తో తయారు చేసే బర్గర్, పిజ్జాలు, డోనట్స్ లలో కూడా ఆల్కాహాల్ తయారవుతుంది.

ఫ్రూట్ జ్యూస్, సాఫ్ట్ డ్రింక్ బేవరేజెస్

ఫ్రూట్ జ్యూస్ లలో కూడా కొద్దిగా ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక ఫ్రూట్ జ్యూసులు మరింత ఫర్మెంటైన్ అయితే అందులో కూడా ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాదు సాఫ్ట్ డ్రింక్ బెవరేజెస్ లో, ప్యాకేజ్డ్ జ్యూస్ లలో కూడా కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది.

ఆహారంలో ఉండే ఆల్కహాల్ హానికరం కాదు

అయితే మనం తీసుకునే ఆహారంలో ఉండే ఈ ఆల్కహాల్ మనకు ఏమాత్రం హానికరం కాదు. చాలా స్వల్ప మోతాదులో ఈ ఆల్కహాల్ ఉంటుంది. ఇది బయట తీసుకునే ఆల్కహాల్ మాదిరిగా మన శరీరం పైన ప్రభావాన్ని చూపించదు. కాకపోతే మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూడా పులియబెట్టి, ఈస్ట్ ప్రొడ్యూస్ చేసే ఏ పదార్థంలో నైనా కొద్దిగా ఆల్కహాల్ తయారవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+