40ఏళ్ళు దాటిన మహిళలకు అలెర్ట్: మీ ఫిట్నెస్ తో పాటు యవ్వనంగా ఉంచే ఫుడ్స్

ప్రస్తుత సమాజంలో ఇటు ఇంటి బాధ్యతలను మరోవైపు ఉద్యోగ బాధ్యతలను రెంటినీ సమంగా నిర్వహిస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళలు వారి ఆరోగ్యం పైన ఫిట్నెస్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆహారం విషయాల్లో కూడా మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

40 ఏళ్ళు దాటితే ఈ ఆహారాలు బెస్ట్
40సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 40సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలలో క్యాల్షియం లోపం పెరుగుతుంది దీనివల్ల ఎముకల బలహీనత వస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం ఆహారంలో పాలను తీసుకోవడం మంచిది. మహిళలు ప్రతిరోజూ పాలు తాగాలి. వేసవికాలంలో పాలపదార్ధాలు అయిన పెరుగు, మజ్జిగ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు చీజ్ అలవాటు చేసుకుంటే కూడా మంచిది.

Alert for women 40 plus Foods that keep you young along with your fitness

ఆహారంలో డ్రై ఫ్రూట్స్
ఆహారంపై శ్రద్ధ పెట్టని మహిళలలో పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపాన్ని నివారించడం కోసం మహిళలు డ్రైఫ్రూట్స్ ను తినడం గానీ డ్రై ఫ్రూట్స్ తో స్మూతీ చేసుకొని తాగడం కానీ చేయడం మంచిది. ముఖ్యంగా బాదంపప్పు, వాల్ నట్స్ , ఎండు ద్రాక్షలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తిన్నా మంచి ప్రయోజనం ఉంటుంది.

సీజనల్ ఫ్రూట్స్
మహిళలు ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినాలి. వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లు, పుచ్చకాయలు, ఖర్బూజ పండ్లు ఇలా ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలి. అంతేకాదు మహిళలు ఆకుకూరలు, కూరగాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు ఒక గిన్నె పప్పును, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలను కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

సలాడ్స్
ప్రతిరోజు మహిళలు సలాడ్ లు తీసుకుంటే మంచిది. సలాడ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. క్యారెట్, దోసకాయ, బీట్రూట్ మొదలైన వాటిని సలాడ్లుగా తీసుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన మహిళలు సరైన ఆహారంతో పాటు తగినంత నీటిని తాగకపోతే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల శరీరం ముడతలు పడుతుంది. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది.

ఓట్స్
కాబట్టి తగినంత నీటిని కూడా తీసుకోవడం అవసరం. ఇది మాత్రమే కాకుండా మహిళలు ప్రతిరోజు అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడం మంచిది. టీ కి బదులుగా గ్రీన్ టీ లేదా తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారానికి మహిళలు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+