నేతి బీరకాయ పచ్చడి .. ఇలా చేసి తింటే అమృతమే!

ఆంధ్ర వంటకాలలో ఎంతో రుచికరమైన, సాంప్రదాయమైన పచ్చడి నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ రోటి పచ్చడిని సరైన విధంగా తయారు చేసి తింటే స్వర్గానికి బెత్తెడే దూరం. వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే నేతిబీరకాయ పచ్చడి అద్భుతమైన రుచితో బాగుంటుంది. మరి నేతిబీరకాయ పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

నేతి బీరకాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

నేతి బీరకాయ – 2

పచ్చిమిర్చి – 8

వెల్లుల్లి రెబ్బలు – 4

జీలకర్ర – 1 టీస్పూన్

మినప్పప్పు – 1 టీస్పూన్

శనగపప్పు – 1 టీస్పూన్

చింతపండు – చిన్న నిమ్మకాయ పరిమాణం

ఉప్పు – సరిపడా

నూనె – 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర- కొద్దిగా

కరివేపాకు - రెండు రెమ్మలు

ఎండు మిరపకాయలు - 2

Andhra Nethi Beerakaya Pachadi Recipe do this pachadi in this process it will give you good taste

తయారీ విధానం

ముందుగా నేతి బీరకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి, చాలా మంది తొక్క తీసి కోస్తారు. కానీ తొక్కతో పాటే ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. . పాన్‌లో కొద్దిగా నూనె వేసి నేతి బీరకాయ ముక్కలు, ఎనిమిది పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసి మగ్గించాలి. నేతి బీరకాయ ముక్కలు మృదువుగా అయ్యే వరకు వేపాలి..ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి నేతి బీరకాయ పచ్చడిని రోటిలో గానీ, మిక్సీలో గానీ వేసి నూరుకోవాలి.

పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్ట్

ఇక ఈ పచ్చడి తయారీకి మగ్గించిన నేతి బీరకాయ ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి నూరుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇక కావాలంటే దీనిని పోపు గింజలు, ఎండు మిరపకాయలతో కలిపి పోపు వేసుకోవచ్చు. వేడి అన్నం, నెయ్యి వేసుకుని గానీ, చపాతీ, జొన్న రొట్టెతో నేటి బీరకాయ పచ్చడి వేసుకుని తింటేరుచి చాలా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+