అల్లంతో అదిరిపోయే వంకాయ కూర.. ఇలా చేస్తే స్పెషల్ టేస్ట్!
పండుగలు, వ్రతాలు వచ్చినప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తినే వంటకాలు చాలా మందికి అవసరం అవుతాయి. అలాంటి సమయాల్లో అల్లం వంకాయ కూర ఒక మంచి ఎంపిక. ఇది సాంప్రదాయ ఆంధ్ర వంటకం. తాజా అల్లం, తెల్ల వంకాయలతో చేసే ఈ కూర రుచిగా ఉండటమే కాకుండా జలుబు, దగ్గు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆలయాల్లో చేసే సాత్విక వంటకాల రుచిని గుర్తు చేస్తుంది.
కావాల్సిన పదార్థాలు
తెల్ల వంకాయలు - 500 గ్రాములు (క్యూబ్స్‌గా తరిగినవి)
తాజా అల్లం - 30 నుంచి 35 గ్రాములు
నూనె - 6 నుంచి 7 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 2 ముక్కలు
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 1 రెబ్బ
పచ్చిమిర్చి - 2 (చీరినవి)
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా అల్లాన్ని బాగా కడిగి, పొట్టు తీసి రోటిలో మెత్తగా దంచుకోండి. మిక్సీలో రుబ్బిన దాని కంటే రోటిలో దంచిన అల్లం రుచి ఎక్కువగా ఉంటుంది. వంకాయలను కడిగి, క్యూబ్స్‌గా తరిగి ఉప్పు నీళ్లలో ఉంచితే రంగు మారదు. బాణలీలో నూనె వేడి చేసి ఆవాలు వేసి తర్వాత ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించండి. ఇలా చేయడం వల్ల స్మోకీ రుచి వస్తుంది. తర్వాత పచ్చి శనగపప్పు వేసి ఎర్రగా వేగనివ్వండి.
జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేగనివ్వండి.ఇప్పుడు దంచిన అల్లం ముద్దను వేసి రెండు-మూడు నిమిషాలు వేయించండి. అల్లం పచ్చి వాసన పోయాక పచ్చిమిర్చి వేసి కలపండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి కాసేపు వేగనివ్వండి. తర్వాత వంకాయ ముక్కలు వేసి మసాలాలు బాగా పట్టేలా మూత పెట్టకుండా మూడు-నాలుగు నిమిషాలు వేయించండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వంకాయ మెత్తబడే వరకు ఉడికించండి.
చివర్లో కొత్తిమీర చల్లి మరో రెండు నిమిషాలు మగ్గించి దించేయండి. ఈ కూరను అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అల్లం ఉండటం వల్ల జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కొంతమంది చిన్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుంటారు. అయితే సాత్వికంగా ఉండాలంటే ఉల్లి వేయకుండా చేయడమే మంచిది. నూనె కాస్త ఎక్కువగా ఉంటే రుచి పెరుగుతుంది. తాజా అల్లం, తెల్ల వంకాయలు వాడితే రుచి మరింత బాగుంటుంది.













Click it and Unblock the Notifications
