క్యాలీఫ్లవర్ ఫ్రై ఇలా వండితే నాన్ వెజ్ కూడా పనికిరాదు!
ప్రతిరోజు మనం తినే కూరలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అయితే సీజన్లో వచ్చే కూరగాయలను తినడం కూడా చాలా మంచిది. చలికాలంలో ముఖ్యంగా క్యాలీఫ్లవర్ వస్తుంది. క్యాలీఫ్లవర్ మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. అయితే నేడు మనం నాన్ వెజ్ కంటే సూపర్ గా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై ఎట్లా చేయాలో తెలుసుకుందాం.
క్యాలీఫ్లవర్ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు
క్యాలీఫ్లవర్- అరకిలో పువ్వు
ఉల్లిపాయలు -2
పచ్చి మిరపకాయలు -4
అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్ (రుచికి తగ్గట్టు)
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – ½ టీస్పూన్
గరం మసాలా -1 స్పూన్
పోపు గింజలు- 1 స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – కొద్దిగా
కొత్తిమీర – అలంకరణకు

తయారీ విధానం
క్యాలీఫ్లవర్ ముక్కలను ఉప్పు నీటిలో 5 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. బాణలిలో నూనె వేడి చేసి పోపు గింజలు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి.ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి..అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆపై క్యాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంట పైన ఉడికించాలి.
ఇలా చేస్తే రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై
ఆపై అందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గేలాగా చూడాలి. తర్వాత అందులో కారం పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి మళ్లీ కలిపి నిదానంగా సన్న మంటపైన ఫ్రై అయ్యేలా చూడాలి. అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై తయారైనట్టే.ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇలా చేస్తే నాన్ వెజ్ కూరల కంటే చాలా రుచిగా ఉంటుంది.












Click it and Unblock the Notifications