వారాంతంలో అదిరిపోయే విందు కావాలా? కాల్చిన ఉల్లిపాయలతో ఘాటైన 'చేపల ఉల్లికారం' తయారీ ఇలా!
చేపలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే, మంచి పోషకాహారం. అటువంటి చేపలను మనం రకరకాలుగా వండుకుని తింటూ ఉంటాం. ప్రస్తుతం మనం ఆంధ్ర స్టైల్లో అన్నంతో కలిపి తినేటట్లు రుచికరమైన, స్పైసీ చేపల వంటకం. ఉల్లి-వెల్లుల్లి మసాలాతో తయారు చేయటం ఎలాగో చూద్దాం. చేపల ఉల్లికారం అన్నంలో కూడా కలుపుకుని తినేలా చాలా బాగుంటుంది. .
కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు — ½ కేజీ
ఉప్పు — ½ టీస్పూన్
పసుపు — ¼ టీస్పూన్
కారం — 1 టీస్పూన్
ధనియాల పొడి — ½ టీస్పూన్
మెంతులు — ½ టీస్పూన్
జీలకర్ర — 1 టీస్పూన్
ధనియాలు — 2 టీస్పూన్లు
నూనె — 4 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
జీలకర్ర — ½ టీస్పూన్
కరివేపాకు — 2 రెమ్మలు
ఉల్లిపాయలు — 2 (ఒకటి కాల్చి పేస్ట్, మరొకటి ముక్కలు)
టమాటా ప్యూరీ — ½ కప్
ఉప్పు, కారం, పసుపు — రుచికి తగినంత
కొత్తిమీర — కొద్దిగా
నిమ్మరసం — 1 టీస్పూన్

తయారీ విధానం:
చేప ముక్కలను 2-3 సార్లు బాగా కడిగి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి 10-15 నిమిషాలు పక్కన పెట్టండి. మెంతులు, జీలకర్ర, ధనియాలు లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి, చల్లార్చి మెత్తగా పొడి చేసుకోండి. ఒక ఉల్లిపాయను స్టవ్ మంటపై బాగా కాల్చుకోండి. చల్లారిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలతో బరకగా గ్రైండ్ చేసుకోండి.
చేపముక్కల ఫ్రై, మసాలా తయారీ ఇలా
ఆపై కడాయిలో నూనె వేడి చేసి, ఆ నూనెలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఉల్లి-అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. టమాటా ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు వేసి మసాలా మగ్గనివ్వండి.
ఇలా చేస్తే చేపల ఉల్లికారం సూపర్ టేస్ట్
ఫ్రై చేసిన చేప ముక్కలు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తిరిగి తిప్పి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చివర్లో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడి అన్నం, రైస్ లేదా చపాతీతో సూపర్‌గా ఉంటుంది.













Click it and Unblock the Notifications