నోట్లో కరిగిపోయేలా ఫంక్షన్ స్టైల్ రవ్వ కేసరి.. ఇలా చేస్తే రోజూ కావాలంటారు!

రవ్వ కేసరి అనేది చాలా త్వరగా, సులభంగా తయారుచేసుకోగలిగే రుచికరమైన స్వీట్. చాలా పండుగలు, శుభ కార్యాలలో దీనిని ప్రత్యేకంగా పెడతారు. మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వతో అద్భుతంగా చేసుకునే రవ్వ కేసరిని ఒకసారి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం. రవ్వ కేసరి తయారీ విధానం ఇక్కడ ఉంది.

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ): 1 కప్పు

పంచదార: 1 కప్పు నుండి ఒకటిన్నర కప్పు

నెయ్యి: 1/2 కప్పు

నీళ్లు: 3 కప్పులు

జీడిపప్పు, కిస్‌మిస్: తగినన్ని

యాలకుల పొడి: 1/2చెంచా

ఫుడ్ కలర్ (ఆరెంజ్ లేదా ఎల్లో): ఒక చిటికెడు

function style Ravva Kesari At Home Simple making process For Soft Melt-in-Mouth Sweet ravva kesari

తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆపై అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేయండి. రవ్వను తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చే వరకు, రంగు మారకుండా 4-5 నిమిషాలు బాగా వేయించి పక్కన పెట్టుకోండి.

రవ్వ కేసరికి పంచదార వేసేటప్పుడు జాగ్రత్త

ఇప్పుడు మరొక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. కావాలనుకుంటే ఈ నీళ్లలోనే చిటికెడు ఫుడ్ కలర్ కలపవచ్చు. నీళ్లు బాగా మరిగిన తర్వాత, మంటను పూర్తిగా తగ్గించి, వేయించి పెట్టుకున్న రవ్వను ఉండలు కట్టకుండా ఒక చేత్తో కలుపుతూ కొద్దికొద్దిగా నీళ్లలో వేయండి. రవ్వ నీటిని పీల్చుకుని దగ్గరపడే వరకు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాతే పంచదార వేయాలి. ముందే వేస్తే రవ్వ ఉడకదు.

పంచదార రవ్వకు బాగా పట్టేలా ఇలా చెయ్యాలి

పంచదార వేసాక అదంతా కరిగి కేసరి మళ్లీ పల్చగా అవుతుంది. మంటను మీడియంలో ఉంచి, పంచదార రవ్వకు బాగా పట్టేలా కలుపుతూ ఉండాలి. నెయ్యి, కేసరి కాస్త చిక్కబడుతున్నప్పుడు మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలపండి. నెయ్యి అంతా కలిసిపోయి, మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా విడిపోతున్నప్పుడు యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్ వేసి బాగా కలపండి.

మునక్కాయ స్వీట్ కార్న్ కర్రీ.. పాలతో కలిపి వండితే నాలుకకు అమృతమే!
మునక్కాయ స్వీట్ కార్న్ కర్రీ.. పాలతో కలిపి వండితే నాలుకకు అమృతమే!

1 కప్పు రవ్వకు ఖచ్చితంగా 3 కప్పుల నీళ్లు

చివరగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోయే రవ్వ కేసరి సిద్ధం అవుతుంది. కేసరి చల్లారిన తర్వాత గట్టిపడకుండా, దూదిలా మెత్తగా ఉండాలంటే 1 కప్పు రవ్వకు ఖచ్చితంగా 3 కప్పుల నీళ్లు ఉపయోగించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+