మొబైల్ కంపెనీల దోపిడీకి చెక్: ఇకపై రీఛార్జ్ ప్లాన్.. విత్ అవుట్ ఇంటర్నెట్: తాజా గైడ్ లైన్స్

మొబైల్ యూజర్లకు టెలికాం నియంత్రణ సంస్థ.. ట్రాయ్ తీపికబురు వినిపించింది. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే కావాలనుకునే వారికి తక్కువ ధరలోనే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. దీనికోసం 'టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) నిబంధనల మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనివల్ల మొబైల్ డేటాతో వద్దనుకున్న వాళ్లు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కాంబో ప్యాక్‌లు కొనాల్సిన అవసరం తప్పుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా రీఛార్జ్ ప్లాన్లలో మొబైల్ డేటా తప్పనిసరిగా ఉంటోంది. దీంతో కాల్స్ మాత్రమే మాట్లాడుకునే సాధారణ కస్టమర్లు కూడా అధిక భారాన్ని మోయాల్సి వస్తోంది. అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటికీ చెక్ పెట్టింది ట్రాయ్. తాజా నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే గల స్పెషల్ టారిఫ్ వోచర్లను (STV) విడిగా అందించాలి. ఈ ప్లాన్ల ధరలను డేటా ప్యాకేజీలతో పోలిస్తే సహేతుకంగా చాలా తక్కువగా ఉండేలా నిర్ణయించాలి ఉంటుంది.

New TRAI Regulations Expand Voice-and-SMS-Only STVs Without Mobile Data Recharge Plans affordable

చిన్న రీఛార్జ్ ప్లాన్లపై ఆధారపడే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ కీలక నిబంధనను విధించింది. 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉండే వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్లాన్లను మొబైల్ కంపెనీలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో తక్కువ కాల వ్యవధికి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికీ మేలు జరుగుతుంది. అలాగే.. 30 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ గల ప్లాన్లలోనూ కనీసం వాయిస్-ఎస్ఎంఎస్-ఓన్లీ ఆప్షన్‌ను తప్పనిసరిగా ఉంచాలని ట్రాయ్ స్పష్టం చేసింది.

పసికూనపై టీమిండియా విలవిల: టార్గెట్ 32 పరుగులే: అభిషేక్ గోల్డెన్ డక్
పసికూనపై టీమిండియా విలవిల: టార్గెట్ 32 పరుగులే: అభిషేక్ గోల్డెన్ డక్

నెలవారీ ప్రాతిపదికన రీఛార్జ్ చేసుకునే ఖాతాదారుల గడువుపై ట్రాయ్ స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా కరెక్ట్‌గా ఒకే తేదీన ఆటోమేటిక్‌గా రెన్యూవల్ అవ్వాలి. ఒకవేళ నిర్దుష్ట నెలలో ఆ తేదీ లేకపోతే ఉదాహరణకు.. ఫిబ్రవరి, లేదా 30 రోజులుండే నెలల్లో 31వ తేదీ వస్తే.. ఆ నెలలోని చివరి రోజున ఈ రెన్యూవల్ ప్రక్రియ పూర్తి కావాలి. అంతే తప్ప 31వ రోజు అందుబాటులో ఉన్నా గానీ 30వ తేదీ నాడే ప్లాన్ ముగియకూడదు. దీనివల్ల కస్టమర్లపై రీఛార్జ్ గడువు గందరగోళం తొలగిపోతుంది.

టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్
టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్

మొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లు నామమాత్రంగా అందుబాటులో ఉంటోన్నాయనే విషయం తెలిసిందే. అందులో కూడా కాలపరిమితి అధికంగా ఉండే ప్లాన్లే ఎక్కువ. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, స్మార్ట్ ఫోన్లను వినియోగించలేని వృద్ధులు, అల్పాదాయం ఉన్నవారు తక్కువ వ్యవధి గల చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకునే అవకాశం కోల్పోతున్నారు. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా కూడా గత్యంతరం లేక మొబైల్ డేటాతో కూడిన రీఛార్జ్ చేసుకుంటోన్నారు.

సడన్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్
సడన్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్

దీనికి చెక్ పెట్టింది.. ట్రాయ్. ఈ తాజా నిబంధనలను ఖరారు చేయడానికి ముందు ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియను నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రతిపాదిత నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. పరిశ్రమ వర్గాలు, ప్రజల నుంచి దాదాపు 1,132 అభిప్రాయాలను సేకరించింది. అనంతరం జూన్ 15న ఓపెన్ హౌస్ చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నూతన విధానం వినియోగదారులకు నెట్ సర్వీసుల భారం లేకుండా తమ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్లు ఎంచుకునే స్వేచ్ఛను కల్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+