ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి.. ఇలా చేస్తే రుచి సూపర్!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయ పచ్చడి మీద అందరి మనసు పోతుంది. ఈ సీజన్లో వచ్చే పచ్చి మామిడి కాయలతో మామిడి తురుము పచ్చడి పెట్టుకుంటే అది అన్నం లోకి మాత్రమే కాదు టిఫిన్స్ లోకి కూడా అదిరిపోతుంది. ఈ పచ్చడి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే ఒక నెలరోజులు పాటు బాగుంటుంది. మరి ఆంధ్ర స్టైల్ మామిడి తురుము పచ్చడి ని ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి తురుము పచ్చడి పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు
మామిడికాయలు- రెండు
కారం- అరకప్పు
ఉప్పు- పావు కప్పు
ఆవాల పొడి- రెండు టేబుల్ స్పూన్లు
మెంతుల పొడి- రెండు టేబుల్ స్పూన్లు
నూనె -అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు- 10
పోపు గింజలు- రెండు టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు- మూడు
కరివేపాకు- కొద్దిగా

తయారీ విధానం
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తురిమి పెట్టుకోవాలి ఒక గిన్నెలో మామిడికాయ తురుము, కారం ఉప్పు ఆవాల పొడి, మెంతులు పొడి వేసి బాగా కలపాలి. కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని పచ్చడిలో కలపాలి. ఇంకొన్ని పోపు కోసం పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి ఇలా
ఇందులో కరివేపాకును కూడా వేసి వేయించుకొని ఈ తాలింపును పచ్చడిలో కలుపుకోవాలి. అంతే ఇన్స్టెంట్ గా రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే అమృతంలా పోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ సీజన్లో చాలా తక్కువ టైంలో తయారు చేసుకోగలిగే మామిడికాయ తురుము పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. బిజీగా ఉండే వారికి, చిన్న కుటుంబాలకు ఈ ఇన్స్టెంట్ పచ్చడి అనుకూలంగా ఉంటుంది.ముఖ్యంగా ఈ మామిడికాయ తురుము పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే అన్ని వస్తువులు పొడిగా ఉండాలి.












Click it and Unblock the Notifications