మండుటెండల్లో తిరిగొచ్చి కూల్ వాటర్ తాగుతున్నారా.. అయితే మీరిది తప్పక తెలుసుకోవాలి

ప్రస్తుతం మనం విపరీతమైన ఎండ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఈ సమయంలో బయట ఎండలో తిరిగి వచ్చి ఇంటికి రాగానే చల్లని నీళ్ళు తాగుతున్నారా.. అయితే డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బాగా ఎండల్లో తిరిగొచ్చికూల్ వాటర్ తాగితే ఏమవుతుందంటే
ఎండలు మండుతున్నాయి అని దాహం తీర్చుకోవటానికి చల్లని నీళ్ళు, ఐస్ వాటర్ తాగే వాళ్ళు ఈ అలవాటును వెంటనే మానుకోవాలని చెప్తున్నారు. తీవ్రమైన ఎండలో తిరిగి వచ్చి చాలా చల్లని నీటిని తాగితే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. దీనివలన మన చిన్న రక్త నాళాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Are you drinking cool water in the hot sun But you must know this information

శరీరంలో నీటి నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు నీళ్ళు తాగాలి
విపరీతమైన ఎండల్లో తిరిగి తిరిగి వచ్చి బాగా చెమటలతో శరీరం డీహైడ్రేట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి చల్లని నీళ్లను వెంటనే తాగితే చాలా డేంజర్ అని చెబుతున్నారు. శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటకు వెళితే దానిని భర్తీ చేసుకోవడానికి నీళ్లను తాగాలి కానీ వెంటనే చల్లటి నీళ్లను తాగకూడదు. అది కూడా ఎండలో తిరిగి తిరిగి వచ్చిన వెంటనే తాగకూడదు.

నీళ్ళు ఎలా తాగాలంటే
ఒకవేళ నీళ్లను తాగిన నార్మల్ వాటర్ అది కూడా నెమ్మదిగా తాగాలి. శరీర ఉష్ణోగ్రత నార్మల్ అవ్వడానికి కాసేపు టైం తీసుకోవాలి. ఆ తర్వాత కాస్త చల్లటి నీళ్లు తాగినా ఇబ్బంది అనిపించదు కానీ ఎండలు మండుతున్నాయని శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఊరికే చల్లటి నీళ్లు తాగడం మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

అలా చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం
విపరీతమైన ఎండల్లో తిరిగివచ్చి ఆ ఎండ తీవ్రత ప్రభావం మన శరీరం పైన, మెదడుపైన ఉన్నప్పుడు, వెంటనే చల్లటి నీళ్లను తాగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఎండాకాలంలో ఎండల్లో తిరిగి తిరిగి వచ్చి చల్లటి నీళ్లను తాగే అలవాటు ఉంటే మానుకోండి.

కుండలో నీళ్ళు తాగితే మంచిది
శరీర ఉష్ణోగ్రతను నార్మల్ చేసుకునే కొంత సమయం ఇచ్చిన తర్వాత చల్లని నీళ్లను తాగండి. అసలు చల్లని నీటిని తాగకుండా ఉంటేనే మంచిది. ఫ్రిజ్ లో పెట్టిన నీళ్ళ కంటే కుండలో ఉన్న నీటిని తాగండి. వడదెబ్బ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+