వర్షాకాలం వాటర్ హీటర్స్ వాడుతున్నారా? హీటర్ వాడకంలో ఈ తప్పులు చెయ్యొద్దు
వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో ఇండియాలో చాలా ఇళ్లలో వాటర్ హీటర్లు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. హీటర్ల వల్ల కాలిన గాయాలు కూడా అవుతున్నాయి. ఒక్కోసారి వాటర్ హీటర్స్ కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే, ప్రభుత్వం కొన్ని కఠినమైన నియమాలు తీసుకురావాలి. అలాగే, ప్రజలు వాటర్ హీటర్లను ఎలా వాడాలో, వాటిని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోవాలి.
వాటర్ హీటర్స్ తో తరచూ జరిగే ప్రమాదాలు
వాటర్ హీటర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తే ఆందోళన కలుగుతుంది. చాలామందికి హీటర్లు వాడుతున్నప్పటికీ దానికి సంబంధించి ఎలా వాడాలి? ఎలా వాడకూడదు? అన్న దానిపై సరిగ్గా అవగాహన లేకపోవటం ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది.. వాటర్ హీటర్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.

వాటర్ హీటర్స్ విషయంలో ప్రభుత్వం చెయ్యాల్సిందిదే
ఈ సమస్యను పరిష్కరించడానికి కఠినమైన నియమాలు తీసుకురావాలని అందరూ కోరుతున్నారు. మార్కెట్‌లో అమ్ముడవుతున్న అన్ని వాటర్ హీటర్లను ప్రభుత్వమే తనిఖీ చేసి, వాటికి సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు, అలాగే అందరూ సురక్షితంగా ఉంటారు. వాటర్ హీటర్ లను విక్రయించేవారు దానికి సంబంధించి ఎలా వినియోగించాలి అనేది డెమో ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి విక్రయించాలి.
చిన్న చిన్న జాగ్రత్తలతో ప్రమాదాల నియంత్రణ
వాటర్ హీటర్ లు లీక్‌లు ఉన్నాయా, వింత శబ్దాలు వస్తున్నాయా అని తరచుగా చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను ముందే గుర్తించవచ్చు. వాటర్ హీటర్లను సురక్షితంగా వాడాలంటే, వాటిని తరచుగా నిపుణులతో తనిఖీ చేయించాలి. రెగ్యులర్ సర్వీసింగ్ చేయడం వల్ల హీటర్లు చెడిపోకుండా ఉంటాయి, అలాగే వాటి లైఫ్ కూడా పెరుగుతుంది. హీటర్లు వేడిగా అవ్వకపోతే, లేదంటే కాలిపోతున్నట్టు వాసన వస్తే, అవి చెడిపోతున్నాయని అర్థం.
ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
వాటర్ హీటర్ల వల్ల ప్రమాదాలు సంభవించకుండా ఉండాలంటే వాటిని తడి చేతులతో వినియోగించరాదు. వాటర్ హీటర్ ఆఫ్ చేసినాకే బకెట్ ను తొలగించాలి. సాధ్యమైనంత వరకు చెప్పులు వేసుకుని వినియోగిస్తే మంచిది. స్టీల్ పాత్రలలో వాటర్ హీటర్ వినియోగించకూడదు. వైర్లు బయటకు వచ్చిన ప్లగ్గులు, లూజ్ పిన్ లు ఉన్నా వాటర్ హీటర్స్ వాడకూడదు.












Click it and Unblock the Notifications