రీల్స్ అతిగా చూస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే!
ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఒక లెక్కలో చెప్పాలంటే రీల్స్ చూడడం అనేది ఒక వ్యసనంగా మారింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు అదే పనిగా ఫోన్లో తలపెట్టి రీల్స్ చూస్తున్న వారు లేకపోలేదు.
రీల్స్ చూడడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బ
రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలను గంటలు తరబడి చూస్తున్న చాలామంది వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రీల్స్ చూడడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. రీల్స్ ని అతిగా చూసే అలవాటు ఉన్నవారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రీల్స్ ఎక్కువగా చూడటం వల్ల మానసిక స్థితి కూడా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

డిజిటల్ ఒత్తిడి ఒక నిశ్శబ్దపు మహమ్మారి
అదేపనిగా కంటిన్యూగా స్క్రీన్ చూడడం వల్ల కనురెప్పల కొట్టడం తగ్గుతుందని, ఫలితంగా కళ్ళు పొడిబారడం, చూపు మందగించడం, మైగ్రేన్, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. facebook, instagram, youtube లలో రీల్స్ షాట్స్ చూస్తున్న వారి సంఖ్య రోజు రోజు పెరుగుతున్న క్రమంలో కళ్ళ పైన పడే ఈ డిజిటల్ ఒత్తిడి ఒక నిశ్శబ్దపు మహమ్మారిలా కంటిచూపును దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలిక కంటి సమస్యలు, శాశ్వత కంటి సమస్యలు
గంటలు తరబడి రీల్స్ చూడడం వల్ల ఇటు పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, కళ్లు పొడిబారిపోవడం,హ్రస్వ దృష్టి పెరగడం, చిన్న వయసులోనే మెల్లకన్ను వచ్చే సమస్య కూడా పెరుగుతుందని, పిల్లలను సాధ్యమైనంత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఈ అలవాటును నియంత్రించలేకుంటే దీర్ఘకాలిక కంటి సమస్యలు, శాశ్వత కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రీల్స్ చూడటం తగ్గించాలంటే ఇలా చెయ్యండి
రీల్స్ చూడటం ఒక్కసారే మానుకోలేకున్నా నిదానంగా చూడటం తగ్గించాలి. ఇక మొబైల్ చూసినా, ల్యాప్ టాప్ చూసినా, ఏది చూసినా సరే 20-20-20 రూల్ పాటించాలి. 2౦ నిముషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా అలవాటు చేసుకోవటం వలన కొంతమేర రీల్స్ పిచ్చి నుండి బయటపడవచ్చు. కంటి ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.












Click it and Unblock the Notifications