ఉసిరి మంచిదే కానీ వీరు అసలే తినొద్దు.. జాగ్రత్త!

శీతాకాలం వచ్చిందంటే మార్కెట్లో ఉసిరికాయలు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే కాయలలో ఉసిరికాయలు ఒకటి. ఆయుర్వేదంలో దీనిని బాగా ఉపయోగిస్తారు. అటువంటి ఉసిరికాయలు కొంతమందికి మాత్రం దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అటువంటివారు ఉసిరికాయలను తినకుండా ఉంటేనే మంచిది. ఎవరు ఉసిరికాయలను తినకూడదు? ఎటువంటి ఆరోగ్య పరిస్థితులలో ఉసిరికాయలను తినకూడదు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

వీరు ఉసిరిని తినొద్దు

తక్కువ రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు ఉసిరికాయలను తినకూడదు. డయాబెటిస్ తో బాధపడేవారు ఉసిరికాయలను తినొచ్చు కానీ హైపోగ్లైసీమియా ప్రమాదం ఉన్నవారు ఉసిరికాయలను తినకుండా ఉంటేనే మంచిది. రక్తస్రావ సమస్యలు ఉన్నవారు కూడా ఉసిరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి . ఉసిరిలో ఉండే యాంటీ ప్లేట్లెట్ లక్షణాల వల్ల ఇది రక్తస్రావ ప్రమాదాన్ని పెంచుతుంది.

Avoid Eating Amla With Low Blood Sugar And With Some Medical Issues

వీరు ఉసిరిని తింటే ఈ ఇబ్బందులు

ఉసిరిలో ఆమ్ల స్వభావం మరియు అధిక విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఇది కొన్నిసార్లు జీర్ణ సంబంధమైన సమస్యలకు కారణమవుతుంది. కనుక సున్నితమైన కడుపు ఉన్నవారు, జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొనే వారు ఉసిరిని తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అటువంటి వారు ఉసిరిని తింటే కడుపు ఉబ్బరం, విరోచనాలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ మందులు వాడేవారు ఉసిరిని తినొద్దు

ఉసిరిలో సహజంగా రక్తాన్ని పలుచబరిచే గుణం ఉంటుంది. ఇది హృదయ సంబంధమైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, వార్ఫరిన్ వంటి టాబ్లెట్లను ఉపయోగించేవారు ఉసిరిని తినకుండా ఉంటేనే మంచిది. ఈ టాబ్లెట్లను ఉపయోగించేవారు ఉసిరిని తింటే ఇది రక్తం గడ్డకట్టే సమయాన్ని పొడిగించవచ్చు. వీరిలో రక్తస్రావ సమస్య పెరుగుతుంది.

మూత్ర పిండాల వ్యాధులు, అలెర్జీలు ఉన్నవారు ఉసిరి తినొద్దు

ఇక యాంటీబయాటిక్ మందులు తీసుకుంటున్న వారు కూడా ఉసిరిని తినాలా వద్దా అనేది వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలో ఆక్సలేట్ గా మారుతుంది. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంది. కనుక మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉసిరిని తినకుండా ఉంటేనే మంచిది. ఇక కొంతమంది ఉసిరిని తింటే అలర్జీలు వచ్చేవారు దీనిని తినకుండా ఉంటేనే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+