షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే ఆయుర్వేద చిట్కాలు, అద్భుతంగా..!!

డయాబెటిస్. ఈ స‌మ‌స్య అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. యుక్త వ‌యస్సులో ఉన్న‌ వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బ‌రువు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఈ వ్యాధి వ‌చ్చిన వారు క్ర‌మం త‌ప్ప‌కుండా మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే స‌రైన జీవ‌న‌శైలిని పాటించాలి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ప‌లు ఆయుర్వేద చిట్కా లు ప‌నిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదంలోనూ షుగరు నియంత్రణు పలు చిట్కాలు ఉన్నాయి. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు కాక‌ర‌కాయ‌ను రోజూ తినాల్సి ఉంటుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలో కాక‌ర‌కాయ అద్భుతంగా ప‌నిచేస్తుంది. తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తే.. దీన్ని జ్యూస్ లేదా ట్యాబ్లెట్లు, పొడి రూపంలో తీసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ జ్యూస్ అయితే రోజూ ఉద‌యం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు 30 ఎంఎల్ మోతాదులో తాగాల్సి ఉంటుంది. కాక‌ర కాయ ట్యాబ్లెట్ల‌ను ఆయుర్వేద వైద్యుల సూచ‌న మేర‌కు రోజూ ఉద‌యం, సాయంత్రం భోజనానికి ముందు 1 లేదా 2 వేసుకోవ‌చ్చు. లేదా కాక‌ర‌కాయ పొడిని నీటిలో క‌లిపి కూగా తాగ‌వ‌చ్చు. ఇలా ఈ చిట్కాను పాటిస్తుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అలాగే వంట‌ల్లో వాడే దాల్చిన చెక్క‌ను తింటున్నా కూడా షుగ‌ర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు.

ayurvedic-home-remedies-for-control-blood-sugar-levels-is-here

షుగ‌ర్‌ను త‌గ్గించ‌డంలో మెంతులు కూడా బాగానే ప‌నిచేస్తాయి. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ మెంతుల పొడిని క‌లుపుకుని తాగితే డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. లేదా 1 టేబుల్ స్పూన్ మెంతుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి మ‌రుసటి రోజు ఉద‌యాన్నే వాటిని తినాలి. అనంత‌రం వాటిని నాన‌బెట్టిన నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తున్నా కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. పూట‌కు రెండు లేదా మూడు ఉసిరికాయ‌ల‌ను అలాగే తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. షుగ‌ర్‌ను త‌గ్గించేందుకు తిప్ప‌తీగ కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది. తిప్ప‌తీగ ర‌సం వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అలాగే రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల కూడా షుగర్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. రాత్రంతా రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను ఒక గ్లాస్ మోతాదులో మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగుతుండాలి. ఇలా రోజూ చేస్తుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. షుగరు కు మందులు వాడుతూనే ఈ చిట్కాలు పాటించటం ద్వారా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ప్రయోజన కరంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+