ఏళ్ల తరబడి వెన్ను నొప్పి వేధిస్తోందా?
గతంలో వెన్ను నొప్పి వచ్చిందంటే చాలా తక్కువ శాతం మందికి వచ్చేది. కానీ వర్తమానంలో మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ వెన్ను నొప్పి వేధిస్తోంది. యువతరం, మధ్య వయస్కులు, వృద్ధులు అంటూ తేడాలేదు. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడంవల్ల అధిక సంఖ్యలో వెన్నునొప్పి బారిన పడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, శరీరంలో పోషకాలు లోపించడం, భారీస్థాయి వస్తువులను ఎత్తినప్పుడు ఎక్కువగా వెన్ను నొప్పి సమస్య ఉంటుంది. ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఆహారం తీసుకుంటే చాలు. అవి ఏమిటో తెలుసుకుందాం.
డార్క్ చాక్లెట్ : వెన్నునొప్పిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపించడంవల్లే వెన్ను నొప్పితోపాటు ఇతర సమస్యలకు కారణమవుతోంది. డార్క్ చాక్లెట్, షేక్, మిఠాయిలు లేదంటే పంచదారతో ఉన్న కోకో పౌడర్ ఉపయోగపడతాయి.

గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ : ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆకు కూరలు తింటుండాలి. విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు వీటిల్లో మెండు. వెన్నునొప్పిని తగ్గించడంలో వీటికి కీలకపాత్ర.
గుడ్డు:
గుడ్డులో విటమిన్ డి, క్యాల్షియం ఉంటాయి. ఎముకలకు ఎంతో బలాన్నిస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో గుడ్డును చేర్చుకోవడంద్వారా వెన్ను నొప్పిని తగ్గించవచ్చు.

పసుపు :
పసుపులో ఔషధ గుణాలు మెండు. ఇన్ ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పసుపు పాలు కానీ, పసుపు టీకానీ తీసుకోవడంద్వారా వెన్ను నొప్పిని నివారించవచ్చు
అల్లం :
వెన్నునొప్పి నుంచి మనిషికి ఉపశమనం కల్పించడంలో అల్లం ప్రభావం ఎక్కువ. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వెన్నునొప్పి సమస్యను తగ్గిస్తాయి. ప్రతిరోజు 2 టీస్పూన్ల అల్లం రసంలో 1 టీస్పూన్ తేనె కలిపి తినడంద్వారా దీన్నుంచి బయటపడొచ్చు.












Click it and Unblock the Notifications