ఈ పొరపాట్లే కిడ్నీలో రాళ్లకు కారణం - జాగ్రత్తగా ఉండాల్సిందే..!!
శరీరంలోని ముఖ్యమైన అవయవం కిడ్నీలు. ఇంతటి ముఖ్యమైన అవయవం విషయంలో ఏ మనం చేసే కొన్ని పొరపాట్ల సమస్యగా మారుతాయి. కిడ్నీలో రాళ్లు చాలా మందిలో ఎదురయ్యే ప్రధాన సమస్య. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి పలు పలు కారణాలు ఉన్నాయి. వీటిలో మనకు తెలిసి చేసే తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు అంటే మూత్రపిండాల లోపల పేరుకుపోయిన ఖనిజాలు చిన్నవిగా స్ఫటికాలను ఏర్పరుస్తాయి. అయితే, ఈ పొరపాట్లకు దూరం గా ఉంటూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి పలు కారణాలు ఉంటాయి. అందులో ప్రతి రోజు తగినంత నీరు తాగకపోవడం కాగా.. కొన్ని రకాల ఆహారాలు సోడియం, చక్కెర, మాంసం అధికంగా ఉన్నవి తీసుకోవడం మరో ప్రధాన కారణంగా. అదే విధంగా కొన్ని జీవనశైలి అలవాట్లు, అధిక బరువు కలిగి ఉండటం, కొన్ని జన్యుపరమైన కారణాలు లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్ పడతాయి. కిడ్నీలో రాళ్ల వల్ల మూత్ర విసర్జనలో నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. ఈ రాళ్లు మూత్ర ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. దీనివల్ల కిడ్నీ దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లు వంటి తీవ్రమైన సమస్యలు ఉంటాయి. చిన్నగా ఉన్న రాళ్లను నీరు ఎక్కువగా తాగడం, వ్యాయా మం చేయడం ద్వారా కిడ్నీలో నుంచి బయటకు పంపవచ్చు. కానీ, పెద్ద రాళ్లకు వైద్య చికిత్స అవసరం కావచ్చు. కిడ్నీలో సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ 8 నుండి 9 గ్లాసుల నీరు తాగండి. నిమ్మరసం వంటి పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అదే విధంగా సోడియం తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తగ్గించడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆక్సలేట్‌లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. టొమాటోలు, కాలీఫ్లవర్, నట్స్ వంటి ఆక్సలేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించాలని పేర్కొంటున్నారు. అధిక బరువు కిడ్నీలో రాళ్లకు ఒక కారణం, కాబట్టి బరువు నియం త్రణలో ఉంచుకోవటం అవసరం. కాల్షియం లోపం కారణంగా కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్ప డే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications