రెండు గుటకల ఈ వాటర్ చాలు: ఏ టానిక్కులు, సిరప్ లు అవసరం లేదు

బార్లీ వాటర్ ఒక ఆరోగ్యకర పానీయం. అనేక పోషకాలతో నిండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బార్లీ వాటర్ ప్రత్యేకత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీని మరిగించి, ఆ ద్రవాన్ని వడకట్టగా వచ్చేదే బార్లీ వాటర్. ఇది దాహం తీర్చడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆసియా, యూరప్‌లలో ఇది ఎంతో ఇష్టమైన హెల్త్ డ్రింక్. అనేక ఆరోగ్య సమస్యలకు గృహవైద్యంగా ఉపయోగిస్తారు. వార్లీ వాటర్ ను గోరువెచ్చగా లేదా చల్లగా తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో తీసుకున్నా దీని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

Barley Water Health Benefits For Digestion And Heart Health while offering a lower calorie option

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బార్లీ వాటర్ జీర్ణక్రియకు అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఇందులో సమృద్ధిగా లభించే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను శాంతపరచి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2. గుండె ఆరోగ్యం: బార్లీ వాటర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం (78 మి.గ్రా), మెగ్నీషియం (11 మి.గ్రా) సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

3. బరువు తగ్గడం: బార్లీ వాటర్ తక్కువ కేలరీలతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది.

4. చర్మం నిగారింపు: బార్లీ వాటర్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. విటమిన్ సీ, సెలెనియం వంటి యాంటీఆక్సిడెంట్లు ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో తోడ్పడతాయి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల స్పష్టమైన, కాంతివంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు.

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బార్లీ వాటర్‌లోని విటమిన్ సీ, ఐరన్ (0.3 మి.గ్రా), మెగ్నీషియం రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పోషకాలు అంటువ్యాధులతో పోరాడే శ్వేత రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండి, అనారోగ్యాలను నివారించవచ్చు. ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

6. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: బార్లీ వాటర్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. మధుమేహం ఉన్నవారికి లేదా చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి ఇది మంచి పానీయం. దీనిలోని ఫైబర్.. షుగర్ కంటెంట్ ను నెమ్మదింపజేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.

7. శరీరాన్ని శుభ్రపరుస్తుంది: బార్లీ వాటర్ సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేసి, శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. బార్లీలోని ఫైబర్ విష పదార్థాలను బంధించి జీర్ణ వ్యవస్థ నుండి తొలగిస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇచ్చి, అదనపు ద్రవాలను తొలగిస్తుంది. దీనిని రోజూ తాగడం వల్ల శరీరం శుభ్రంగా ఉండి, సక్రమంగా పనిచేస్తుంది.

Disclaimer: బార్లీ వాటర్ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పాఠకులకు తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. మరింత అదనపు సమాచారం కోసం డాక్టర్లు, డైటీషియన్లను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+