తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటున్నారా?
బియ్యం అంటే మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు మూడు పూటలా పళ్లెంలో తెల్లగా మెరిసిపోతూ తళతళలాడుతున్న అన్నాన్ని తింటుంటాం. అయితే ఒకప్పుడు మన పూర్వీకులు దంపుడు బియ్యమే తినేవారు. చూడటానికి అవి బాగోవు.. ఆరోగ్యాన్నిస్తాయి. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం చూడటానికి ఎంతో అందంగా కనపడతాయి.. అనారోగ్యాన్నిస్తాయి. వాటికీ వీటికి అదే తేడా. దంపుడు బియ్యం అంటే పోషకాల గని. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో ఖనిజాలు, విటమిన్లు ఎన్నో ఉంటాయి. మనం వడ్లను పాలిష్ పట్టించేటప్పుడు ఇవన్నీ వెళ్లిపోతాయి. అందుకే దంపుడు బియ్యమే తినాలంటూ ఎంతోమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు.
ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి
వారానికి ఐదుసార్లు లేదంటే అంతకన్నా ఎక్కువ తెల్ల బియ్యం తీసుకుంటే షుగరు వస్తుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. తెల్లబియ్యాన్ని తగ్గించుకొని దానిస్థానంలో దంపుడు బియ్యం తీసుకుంటే షుగరు వచ్చే ముప్పు 16 శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువగా ఉంటుంది. నియాసిన్, విటమిన్ బీ3 లాంటివాటితోపాటు ఎముకలను ఆరోగ్యంగా ఉండే మెగ్నీషియం కూడా దంపుడు బియ్యంలో ఉంటుంది.

క్యాన్సర్ ను తగ్గిస్తాయి
దంపుడు బియ్యంలో సెలీనియం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవటానికి ఇది తోడ్పడుతుంది. అలాగే వీటిల్లో లిగ్నాన్లనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్ ఎంటెరోలాక్టేన్ గామారి క్యాన్సర్ ను నివారిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. దంపుడు బియ్యంలో ఉండే పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. రక్తంలో ఉండే గ్లూకోజు స్థాయిలు కూడా త్వరగా పెరగవు. తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలిగి ఆకలి కూడా వేయదు. ఇలా ఈ బియ్యం తినడంవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజురోజుకు తెల్ల బియ్యాన్ని తగ్గించి దంపుడు బియ్యాన్నే తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications