ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా- ఎవరికి ఏది మంచిది..!?
అల్పాహారం ఆరోగ్య పోషణలో కీలకమైనది. అల్పాహారం ఎవరూ మిస్ కావద్దని నిపుణులు సైతం ఈ మధ్య కాలంలో తరచూ హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళ తీసుకునే అల్పాహారం జీవక్రియపై ప్రభావం చూపుతుంది. అల్పాహారంలో ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహా లేదా పండ్ల రసం వంటి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇలాంటి అల్పాహారం తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర పెరిగి, ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోతుంది. దీంతో... ప్రొటీన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. అల్పాహారం గా ఏదీ తీసుకుంటూ మేలు చేస్తుందో వివరిస్తున్నారు.
సరైన పోషకాలతో కూడిన అల్పా హారం రోజంతా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అందు లో భాగంగా గుడ్డు భుర్జీ, టోఫు భుర్జీ, పనీర్ భుర్జీ, శనగపిండి చీలా వంటి సులభమైనవి. ప్రొటీన్ అధికంగా ఉండే అల్పాహారం కండర వ్యవస్థను బలోపేతం చేసుకోవటంతో పాటుగా జీవక్రియకు మద్దతు అందిస్తుంది. అలసటను తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారం, జీవనశైలిలో కొన్ని సులభమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగా పాలకూర, కాలే, మెంతికూర వంటి ఆకుకూరలతోపాటు బెర్రీలు, సిట్రస్ పండ్లు వంటి రంగురంగుల పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. శాకాహారులు ఉదయం సుమారు 100 గ్రాముల పనీర్‌ను ఉప్పు, మిరియాల పొడి వేసి పెనంపై కాల్చుకుని తినవచ్చని, లేదా పనీర్ పరాఠా, పనీర్ భుర్జీ తీసుకోవచ్చని ఆమె సూచించారు. దీంతోపాటు ఒక గ్లాస్ కూరగాయల రసం తీసుకోవచ్చని తెలిపారు. పోషక అవసరాలను తీర్చడంతోపాటు శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచే అల్పాహారమే సరైన అల్పాహారం అని ఆమె వివరించారు. కివీ ముక్కలు, నీటిలో నానబెట్టిన చియా గింజలతో తయారుచేసిన పుడ్డింగ్‌ను తినవచ్చు. అరటి పండు ముక్కలు, వాల్నట్స్ కలిపి చేసిన ఓట్మీల్ ను తిన్నా ప్రయోజనకరంగా ఉంటుంది.

నిపుణుల సూచనలు
రోజును పండ్లతో ప్రారంభించి, ఆ తర్వాత ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు కూడా మంచిదేనని, ఆ తర్వాత టోస్ట్తోపాటు టమాటా, క్యారెట్, బీట్రూట్ రసం లేదా బూడిద గుమ్మడికాయ రసం తీసుకోవచ్చని చెబుతున్నారు. శాకాహారులు ఉదయం సుమారు 100 గ్రాముల పనీర్‌ను ఉప్పు, మిరియాల పొడి వేసి పెనంపై కాల్చుకుని తినవచ్చని, లేదా పనీర్ పరాఠా, పనీర్ భుర్జీ తీసుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, పుదీనా, కేరట్, బీట్రూట్లను సన్నగా తరిగి కోడిగుడ్ల సొనల్లో కలిపి ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు. ఈ ఆమ్లెట్లో ఉల్లిపాయ ముక్కలను కలపకూడదు. దీనితోపాటు కీర సలాడ్‌ను తినడం శ్రేయస్కరం. గ్లాసు పాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, మితంగా గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవచ్చు. నూనె పదార్థాలు, స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, పుల్లటి పండ్లు కాకుండా తేలికగా జీర్ణమయ్యే వాటిని అల్పాహారంలో చేర్చుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
