Video: మనిషిని పీక్కు తిన్న పెద్ద పులి.. వైల్డ్‌లైఫ్ పార్క్‌లో భయానక ఘటన

ఇంగ్లాండ్‌లోని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి హఠాత్తుగా రాయల్ బెంగాల్ పులి ఉన్న బోనులోకి దూకడం.. మరుక్షణమే ఆ క్రూర మృగం దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా విహారయాత్ర కోసం వచ్చే పర్యాటకులతో కిటకిటలాడే ఆ వైల్డ్‌లైఫ్ పార్క్.. ఒక్కసారిగా భయాందోళనలతో, కేరింతల స్థానంలో ఆర్తనాదాలతో అల్లకల్లోలంగా మారిపోయింది.

డాలర్ల కోసం పులుల్ని చంపుకున్నాం! యాడ్స్ ఇచ్చి మరీ పులి వేట.. ఇందిరా గాంధీ ఆర్డర్స్..?
డాలర్ల కోసం పులుల్ని చంపుకున్నాం! యాడ్స్ ఇచ్చి మరీ పులి వేట.. ఇందిరా గాంధీ ఆర్డర్స్..?

సౌత్ యార్క్‌షైర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఈ ఘోరం జరిగింది. శనివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో ఒక వ్యక్తి ఉన్నట్టుండి పులుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతా చూస్తుండగానే, సెకన్ల వ్యవధిలోనే పులి ఆ వ్యక్తిపై విరుచుకుపడింది. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని కాపాడలేకపోయారు.

Man Mauled to Death After Jumping Into Tiger Enclosure at UK Wildlife Park Sparking Major Safety Shock

మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ విషాదకర వార్తను అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారికి ధైర్యం చెప్పేందుకు ప్రత్యేక పోలీసు అధికారులను రంగంలోకి దించినట్లు సౌత్ యార్క్‌షైర్ పోలీస్ యంత్రాంగం తెలిపింది.

సురక్షితంగానే పులి.. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి

ఈ దారుణ ఘటన తర్వాత పార్క్‌లో ఉన్న పులికి ఏదైనా హాని జరిగిందా అన్న సందేహాలు, పుకార్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఆ పులి సంపూర్ణ ఆరోగ్యంతో, ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగానే బోనులోనే ఉందని స్పష్టం చేశారు. సందర్శకులకు ఎలాంటి ప్రమాదం లేదని, అనవసరమైన ఊహాగానాలను నమ్మవద్దని కోరారు.

వరంగల్ కేంద్రంగా సైబర్ ముఠా..దేశవ్యాప్తంగా 185 సైబర్ నేరాలతో లింకులు!
వరంగల్ కేంద్రంగా సైబర్ ముఠా..దేశవ్యాప్తంగా 185 సైబర్ నేరాలతో లింకులు!

సోషల్ మీడియా వీడియోలపై ఆంక్షలు

సంఘటన జరిగిన సమయంలో కొందరు తీసిన దారుణమైన వీడియోలు నెట్‌లో ప్రత్యక్షమవ్వడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన కలిగించే దృశ్యాలు ఉన్న సదరు వీడియోలను ఎవరూ నెట్టింట షేర్ చేయవద్దని, బాధితుడి కుటుంబ గౌరవాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్క్ ఖాళీ.. విచారణ వేగవంతం

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ యాజమాన్యం.. పర్యాటకులందరినీ బయటకు పంపి వేగంగా పార్క్‌ను ఖాళీ చేయించింది. అత్యవసర ప్రోటోకాల్స్‌ను అమల్లోకి తెచ్చి, ఆదివారం వరకు పార్క్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సందర్శకులు, సిబ్బంది, మూగజీవాల రక్షణకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కంటూ, ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తేల్చేందుకు పోలీసులతో కలిసి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+