రొమ్ము క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు.. ముందే గుర్తిస్తే గండం గట్టెక్కినట్టే!
క్యాన్సర్ ఇది సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ప్రస్తుతం సమాజాన్ని ముఖ్యంగా మహిళలను రొమ్ము క్యాన్సర్ వణికిస్తోంది. రొమ్ము క్యాన్సర్ ప్రారంభంలో నొప్పిలేని గడ్డ, చర్మం ఆకృతిలో మార్పులు, చనుమొనల నుంచి ద్రవరూపంలో ఉత్సర్గ, చనుమొన లోపలికి వెళ్లడం వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది.రొమ్ము క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఆరోగ్యసమస్య. ప్రారంభగుర్తింపు చికిత్స ఫలితాలను చాలా మెరుగుపరుస్తుంది. ప్రారంభంలో రొమ్ము క్యాన్సర్ ను గుర్తిస్తే, చికిత్స చేయగలిగితే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
రొమ్ము క్యాన్సర్ కు సాధారణ ప్రారంభ సంకేతాలు
రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలలో ఒకటి రొమ్ములో గడ్డ ఏర్పడడం. అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు, కానీ వాటిని ఆరోగ్య సంరక్షణ నిపుణుడిచే తనిఖీ చేయించుకోవడం అవసరం. ఇతర మార్పులు వాపు, చర్మం చికాకు కలిగించడం, లేదా గుంతలు పడటం వంటి లక్షణాలు కూడా ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్ కు దారి తీయవచ్చు.

ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చెయ్యొద్దు
రొమ్ము క్యాన్సర్ కు రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులు అంతర్గత సమస్యలను సూచించవచ్చు. అదనంగా, చనుమొనలలో మార్పులు, ఉదాహరణకు లోపలికి తిరగడం లేదా స్రవించడం వంటివి కనిపించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు వెంటనే వైద్యునితో పరిశీలించుకుని కారణాలు తెలుసుకోవాల్సిందే.
ఇవి కనిపిస్తే జాగ్రత్త
రొమ్ములలో లేదా చనుమొనలలో ఎర్రగా మారినా లేదా పొడి చర్మం కనిపించినా రొమ్ము క్యాన్సర్ గా అనుమానించి వైద్యులను సంప్రదించాలి. ఏదైనా నిరంతర మార్పులను పర్యవేక్షించడం డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో ఒక్కొక్కసారి గుర్తించబడదు. రొమ్ము స్వీయ పరీక్ష ద్వారా కొన్ని మార్పులను మీరు గమనించవచ్చు.
వైద్యులను సంప్రదించండి
అయితే మీరు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స తగ్గించడం సులభం అవుతుంది. లేదంటే అది మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కనుక అప్పుడప్పుడు క్యాన్సర్ విషయంలో పరీక్షలు చేయించుకోవడం ఆరు నెలలకు ఒకసారి మోమోగ్రామ్ చేయించుకోవడం ముఖ్యం.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
మోర్ డేంజర్- ఆ వెయిట్ లాస్ డ్రగ్ పై కేంద్రం హెచ్చరిక -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications