బ్రౌన్ రైస్ అందరూ తినొచ్చా, ఏది బెస్ట్ - వీరు దూరంగా ఉండాల్సిందే..!!
తెల్ల బియ్యం.. బ్రౌన్ రౌస్. ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచింది. ఈ మధ్య కాలంలో బ్రౌన్ రైస్ వినియోగం బాగా పెరిగింది. ఆరోగ్య పరంగా బ్రైన్ రైస్ మంచి ఫలితాలు ఇస్తుందనేది నిపుణులు చెబుతున్న మాట. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, ప్రీడయాబెటిస్ లక్షణాలను నివారించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ ను వైద్యులు సిఫార్స్ చేస్తుంటారు. ఎందుకుంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనదిగా పరిగణించడానికి ప్రధాన కారణాల్లో ఫైబర్ కంటెంట్ అని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటే తెల్లబియ్యంలో 0.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటుంది. బ్రౌన్ రైస్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుం దని, రోజంతా కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలతో పాటు నియా సిన్, థయామిన్ వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది మంచి పోషక ఆహారం గా నిపుణులు సూచిస్తున్నారు.

బ్రౌన్ రైస్ లో తక్కవ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. తెల్ల బియ్యం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, బ్రౌన్ రైస్ తినడం వల్ల తక్కువ ప్రమాదం ఉంటుందని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది. బ్రౌన్ రైస్ ప్రతిరోజూ తిన డం వల్ల జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందని, నిరంతరం శక్తిని అందిస్తుంది. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదే, కానీ దీన్ని అందరూ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఆర్సెనిక్, ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నాడం వల్ల పిల్లలకు, గర్భిణులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చని చెబుతు న్నారు. ఈ రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బ్రౌన్ రైస్ తినేటప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదించిన తరువాత వినియోగిస్తే మంచింది.












Click it and Unblock the Notifications