షుగర్ పేషంట్స్ సీతాఫలం తినొచ్చా..?
సీతాఫలం గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. దీన్ని కస్టర్డ్ యాపిల్ అని, షుగర్ యాపిల్ అని పిలుస్తారు. గ్రామాలు, పల్లెలు, అడవుల్లో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తుంటాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లు శీతాకాలంలో ఎక్కువగా లభ్యం అవుతుంటాయి. ఇక ఈ పండ్లలో విటమిన్ బి6, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ పండును కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు సీతాఫలం తిన్న వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు సీతాఫలం తినొద్దని చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినకూడదని అంటుంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ పండును ఎలాంటి భయం లేకుండా తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవాళ్లు మితంగా ఈ పండుని తినొచ్చని వైద్యులు వివరిస్తున్నారు. ఇది ఇన్ ఫ్లమేషన్ తగ్గించి, గుండెకి మేలు చేస్తుందంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఏ, సీ లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. ఇక సీతాఫలం తింటే జలుబు చేస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ ఈ పండును తింటే ఎలాంటి జలుబు చేయదని వైద్యులు చెబుతున్నారు.

ఇక ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వైద్యులు రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు సీతాఫలాన్ని తినమని సిఫార్సు చేస్తారు. అంతేకాక ఇది అలసటను దూరం చేస్తుంది. అలాగే సీతాఫలంలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మెదడులోని ఒత్తిడి స్థాయిలను నియంత్రించడంతోపాటు పార్కిన్సన్స్, క్షీణించిన మెదడు రుగ్మత నుంచి కూడా ఈ పండ్లు రక్షిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలగే సీతాఫలంలోని పీచు పదార్థం శరీరంలోని టాక్సిన్స్ ను సులభంగా తొలగించడంలో సహాయపడుతుందని.. అంతేకాక అసిడిటీ, పొట్టలో పుండ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications