గుండెపోటుతో యువత మరణం-అది HOCM కావొచ్చు- డా.సాయి రవిశంకర్

మ‌న దేశంలో ప్ర‌తియేటా సుమారు 7 ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్నారు. ఈ త‌ర‌హా మ‌ర‌ణాల‌కు ప్ర‌ధాన కార‌ణం స‌డ‌న్ కార్డియాక్ అరెస్ట్.ఇటీవ‌లే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 23 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ఒక యువ‌తి త‌న స‌మీప బంధువు పెళ్లి వేడుక‌ల్లో హ‌ల్దీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా డాన్సు చేస్తూ కుప్ప‌కూలిపోయింది.అక్క‌డే ఆమె బంధువుల్లో ఉన్న వైద్యులు ఆమెకు సీపీఆర్ (కార్డియో ప‌ల్మ‌న‌రీ రీస‌సిటేష‌న్‌) చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా,అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు.ఆమె కుటుంబంలో గ‌తంలో ఆమె సోద‌రుడు 12 ఏళ్ల వ‌య‌సులో ఉండ‌గా ఇలాగే ఉన్న‌ట్టుండి గుండెపోటుతో మ‌ర‌ణించాడు.ఇలాంటి మ‌ర‌ణాలు,వాటికి కార‌ణాలు నివార‌ణ మార్గాల గురించి న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి గుండెవైద్య విభాగాధిప‌తి,సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎ. సాయి ర‌విశంక‌ర్ ప‌లు విష‌యాలు తెలిపారు.

"స‌డ‌న్ కార్డియాక్ అరెస్టు అనేది చాలా దుర‌దృష్ట‌క‌రం. అది వ‌చ్చిన త‌ర్వాత మ‌న‌కు ఏమైనా చేయ‌డానికి కూడా స‌మ‌యం ఉండ‌దు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఘ‌ట‌న విష‌యంలో అక్క‌డే అదే వేడుక‌లో కొంత‌మంది డాక్ట‌ర్లు ఉండి,వారు సీపీఆర్ చేసినా ఆ యువ‌తి బ‌త‌క‌లేద‌న్న విష‌యాన్ని మనం గుర్తించాలి.ఆమె కుటుంబంలో అప్ప‌టికే వాళ్ల సోద‌రుడు 12 ఏళ్ల వ‌య‌సులోనే గుండెపోటు కార‌ణంగా మ‌ర‌ణించార‌ని చెబుతున్నారు.ఇలా సొంత కుటుంబంలో (అంటే త‌ల్లిదండ్రులు, సోద‌రులు, సోద‌రీమ‌ణులు) ఎవ‌రికైనా గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణించిన చ‌రిత్ర ఉంటే..వారు త‌ప్ప‌నిస‌రిగా పూర్తిస్థాయి గుండెవైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి" అని పేర్కొన్నారు.

Cardiac arrests at young age- cardiologist Dr Sai Ravi shankar explains the reasons

వైద్యపరీక్షలు చేయిస్తే వారికి పుట్టుక‌తోనే ఏమైనా గుండె స‌మ‌స్య‌లు ఉన్నాయేమో గ‌మ‌నిస్తాం.లేదా..ఇలాంటివారిలో చాలామందికి ఇప్పుడు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య హైప‌ర్‌ట్రోఫిక్ అబ్‌స్ట్ర‌క్టివ్ కార్డియోమ‌యోప‌తి (హెచ్ఓసీఎం).ఈ స‌మ‌స్య ఉన్న‌వారు బాగా క‌ఠిన‌మైన వ్యాయామాలు చేయ‌కూడ‌దు,డాన్సులు,ఫుట్‌బాల్ లాంటి ఆట‌లు ప‌నికిరావు.శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా ఉండే ప‌నులేవీ చేయ‌కూడ‌దు.దాంతోపాటు ముందునుంచే త‌గిన వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటే..అందుకు త‌గిన చికిత్స కూడా చేసి,వారు మ‌ర‌ణించే ప్ర‌మాదాన్ని చాలావ‌ర‌కు త‌ప్పించ‌గ‌లం.అందుకోసం.. కుటుంబ‌చ‌రిత్ర ఉన్న‌వారు ముందుగానే ఏడాదికోసారి త‌ప్ప‌నిస‌రిగా పూర్తి గుండెవైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.ఒక‌వేళ మొద‌టి ప‌రీక్ష చేయించుకున్న‌ప్పుడు వారికి ఎలాంటి స‌మ‌స్య లేద‌నుకున్నా, అప్పుడు కూడా మూడేళ్ల‌కోసారి ప‌రీక్ష‌లు త‌ప్ప‌క చేయించుకోవాలి.

కుటుంబ చ‌రిత్ర లేక‌పోయినా..
కుటుంబంలో ఎవ‌రికీ ఇలా స‌డ‌న్ కార్డియాక్ అరెస్టు వ‌చ్చిన చ‌రిత్ర లేక‌పోయినా..కొన్ని ముప్పు కార‌కాలు ఉన్న‌వారు కూడా ప్ర‌తియేటా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.వాటిలో మ‌ధుమేహం,అధిక ర‌క్త‌పోటు, పొగ తాగే అల‌వాటు,మ‌ద్య‌పానం,అధిక కొలెస్ట‌రాల్ ఉండ‌డం లాంటివి ఉంటాయి.ఇవి ఉన్న‌వారు కూడా ఏడాదికోసారి త‌ప్ప‌కుండా వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకుంటే,గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌చ్చు.మ‌ధ్య‌ప్ర‌దేశ్ యువ‌తి ఘ‌ట‌న‌తో పాటు ఇటీవ‌లి కాలంలోనే మ‌నం కొంత‌మంది క్రీడాకారులు,న‌టులు,రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్నట్టుండి గుండెపోటుతో మ‌ర‌ణించిన సంఘ‌ట‌న‌లు చూశాం.నిజానికి చేతిలో డ‌బ్బులు పుష్క‌లంగా ఉన్నా,కొన్నిసార్లు ప్రాణాలు కాపాడేందుకు అవి ప‌నికిరాక‌పోవ‌చ్చు.అదే కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఇలాంటి హ‌ఠాన్మ‌ర‌ణాల‌ను త‌ప్పించే అవ‌కాశం మ‌న చేతుల్లోనే ఉంటుంది.అందువ‌ల్ల ఈ ముప్పు కార‌కాల్లో ఏ ఒక్క‌టి ఉంద‌నుకున్నా..త‌ప్పనిస‌రిగా ప్ర‌తియేటా స‌మ‌గ్ర వైద్య ప‌రీక్ష‌లు, అందులోనూ గుండె వైద్య ప‌రీక్ష‌లు త‌ప్ప‌కుండా చేయించుకోవాలని డాక్ట‌ర్ సాయి ర‌విశంక‌ర్ వివ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+