మధుమేహం ఉందా? ఈ ఒక్కటి తినిచూడండి
పాలతోపాటు పాల ఉత్పత్తులు కూడా శరీరానికి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. అటువంటివాటిల్లో జున్ను ప్రథమ స్థానంలో నిలుస్తుంది. పలు అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, జింక్, విటమిన్ A, B12తో పాటు అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు, సోడియం కూడా ఉంటాయి. జున్ను తీసుకోవడం వల్ల డిమెన్షియా ప్రమాదం తగ్గుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
జున్నులో ఉండే విటమిన్ B12, D వంటి పోషకాల వల్ల జరుగుతుంది. జున్ను ఎముకలకు అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ పెద్ద మొత్తంలో అందిస్తుంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఇందులో ఉండే కాల్షియం తోడ్పడుతుంది. ఫాస్పరస్ కాల్షియం శోషణలో సహాయపడుతుంది. జున్నులో పెద్ద మొత్తంలో విటమిన్ ఏ, బి12 ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థకు ముఖ్యమైనవి. విటమిన్ ఏ ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయాన్నందిస్తుంది. విటమిన్ బి 12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

జున్నులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు వాపులను నివారిస్తాయి. జీర్ణక్రియను శుభ్రపరచడంతోపాటు కొన్ని రకాల జున్ను ప్రోబయోటిక్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సన్నగా ఉన్నవారు లావవడానికి, తల్లి పాలు వృద్ధి చెందడంతోపాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే వ్యాధి తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. డీ విటమిన్ లోపంవల్ల తలెత్తే ఆస్టియో పోరోసిస్ లోపాన్ని తొలగించుకోవచ్చు.












Click it and Unblock the Notifications