పెరుగు Vs మజ్జిగ - ఎవరికి ఏది మంచిది..!!
పెరుగు...మజ్జిగ. రెండూ పాల ఉత్పత్తులే. అయితే, ఈ రెండింటి లో ఏది ఆరోగ్యానికి మంచింది. ఈ అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెండింటి లోనూ ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, వాటిని ఎంచుకునేటప్పుడు శరీర పరిస్థితి.. అవసరం కు అనుగుణంగా ఎంపిక చేసుకుంటాం. ఏ వయసు వారికైనా వీటి ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. పలువురు నిపుణులు ఈ రెండింటి వినియోగం పైన స్పష్టత ఇచ్చారు. వీటి వినియోగం ద్వారా ఎవరికి ఏది మంచిదో వివరించారు.
పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్ట్స్. ఇవి రెండు కూడా ఎముకల బలం, జీర్ణక్రియ కు మేలు చేస్తాయి. రెండు ఉపయోగకరమే అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్ర వేర్వేరు ప్రయోజనాలు అందిస్తాయి. పెరుగు తినడం వల్ల ప్రోబయోటిక్స్ శరీరానికి అందుతాయి. పొట్టలో మంచి బాక్టీరియా ఉంటేనే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. శరీరం పోషకాలను గ్రహించే శక్తి పొందుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పెరుగులో ఉండే కాల్షియం ఎముకల బలాన్ని, దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. పిల్లలు, వృద్ధుల్లో ఎముకల సమస్యలు ఉంటే వారికి పెరుగు మేలు చేస్తుంది. ఇందులోని ప్రో బయోటిక్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయి. మలబద్ధకం, అతిసార వంటి జీర్ణ సమస్యలను నియంత్రిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గించేలా చేస్తుంది. విటమిన్ B12, విటమిన్ D, రిబోఫ్లేవిన్, పొటాషియం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

అదే విధంగా మజ్జిగ ద్వారానూ అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోనూ ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటి ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి వాటిని దూరం చేస్తాయి. మజ్జిగలో కాల్షియం, విటమిన్ D ఉండటంతో ఎముకల బలాన్ని పెంచటంతో పాటుగా ఆస్టియోపొరోసిస్ ను నివారిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోటీన్లు, విట మిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. మజ్జిగ తరచూ తీసుకోవటం ద్వారా వేడి నుంచి ఉపశమనం లభించటంతో పాటుగా డీహైడ్రేషన్ బారి నుంచి తప్పిస్తుంది. మజ్జిగ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు పెరుగు, మజ్జిగ... రెండింటితోనూ ప్రయోజనాలు ఉన్నాయి. రెండూ ఆరోగ్యానికి మంచి చేసేవే. కాగా, కొన్ని సందర్భాల్లో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్య పరంగా ఎక్కువ మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో మజ్జిగ శరీరంలో కోల్పోయే శక్తిని తిరిగి అందించటంలో సహకరిస్తుంది.












Click it and Unblock the Notifications